దీపావళి బంపర్ ఆఫర్ : రూ.1కే షియోమీ స్మార్ట్‌ఫోన్
సేల్ జరగనున్న తేదీల్లో ప్రతి రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రూ.1 సేల్ కొనసాగుతుంది. ఇందులో రెడ్మీ నోట్ 4, ఎంఐ రూటర్ 3సీ, రెడ్మీ 4, ఎంఐ బ్లూటూత్ మినీ స్పీకర్, ఎంఐ సెల్ఫీ స్టిక్, రెడ్మీ 4ఎ, ఎంఐ బ్యాండ్ హెచ్ఆర్ఎక్స్ ఎడిషన్, ఎంఐ క్యాప్సూల్ ఇయర్‌ఫోన్స్, ఎంఐ వైఫై రిపీటర్, ఎంఐ బ్యాక్‌ప్యాక్, ఎంఐ వీఆర్ ప్లేలను కేవలం రూ.1కే పొందేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా సేల్ జరిగే రోజుల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు యాప్‌లో బిడ్ టు విన్ సేల్ ను నిర్వహించనున్నారు.
ఇవే కాకుండా సేల్ సందర్భంగా షియోమీ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీ రాయితీలను అందివ్వనున్నారు. ఆయా ఉత్పత్తులపై కనీసం రూ.100 రాయితీ మొదలుకొని గరిష్టంగా రూ.2500 వరకు డిస్కౌంట్లను అందివ్వనున్నారు
0 comments:
Post a Comment