విద్యుత్ శాఖలో 1422 ఏఈ పోస్టుల భర్తీకి నిర్ణయం
* డిసెంబరులోగా నియామకాలు
* తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని నాలుగు విద్యుత్ సంస్థల్లో 1422 అసిస్టెంట్ ఇంజినీరు(ఏఈ) పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి సెప్టెంబరు 21న ప్రకటించారు. నియామకాల కోసం వచ్చే నవంబరులో రాతపరీక్షలు నిర్వహిస్తామని సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పోస్టుల భర్తీ ప్రక్రియను వివరించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ పరిధిలోని మొత్తం 1422 ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అవినీతికి తావులేకుండా జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో రాతపరీక్షలు నిర్వహిస్తున్నామని ఉద్యోగాలిప్పిస్తామంటూ దళారులెవరైనా ప్రలోభపెడితే 83329 83914 ఫోన్‌నంబరుకు ఫిర్యాదు చేయాలని నిరుద్యోగులకు సూచించారు. డిసెంబరుకల్లా నియామకాల ప్రక్రియను పూర్తిచేసి జనవరి ఒకటికల్లా కొత్త ఉద్యోగులు విధుల్లో చేరేలా చూస్తామని ఆయన వివరించారు. అన్ని విద్యుత్‌సంస్థల్లో పోస్టులను భర్తీ చేస్తున్నందున నిరుద్యోగులు అన్నింటికీ హాజరయ్యేందుకు వీలుగా వారానికొకటి చొప్పున నాలుగుసార్లు పరీక్షలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. వివరాలన్ని వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని ఆయన పేర్కొన్నారు.
ఖాళీల వివరాలు...
* జెన్‌కో: 856 (ఎలక్ట్రికల్-419, సివిల్-172, ఎలక్ట్రానిక్స్-70,మెకానికల్-195).
* ట్రాన్స్‌కో: 206 (ఎలక్ట్రికల్-184, సివిల్-22)
* ఉత్తర డిస్కం(ఎన్‌పీడీసీఎల్)-ఎలక్ట్రికల్: 159
* దక్షిణ డిస్కం(ఎస్‌పీడీసీఎల్)-ఎలక్ట్రికల్: 201
పరీక్ష తేదీలు..
* ఎన్‌పీడీఎల్ అభ్యర్థులకు: నవంబర్ 8.
* జెన్‌కో అభ్యర్థులకు: నవంబర్ 14.
* ఎన్‌పీడీసీఎల్ అభ్యర్థులకు: నవంబర్ 22.
* ట్రాన్స్‌కో అభ్యర్థులకు: నవంబర్ 29.
వెబ్‌సైట్: http://www.tsgenco.telangana.gov.in/
0 comments:
Post a Comment