1 June 2015

వారంలోగా వేలాది ఉద్యోగాలకు ప్రకటన జారీ!

* టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ చక్రపాణి హైదరాబాద్‌: వారంలోగా తెలంగాణలో వేలాది ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన జారీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ చక్రపాణి జూన్ 1న తెలిపారు. నగరంలోని నారాయణగూడలో ఈరోజు పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకటనకు సంబంధించి ఉత్తర్వుపై ప్రభుత్వానికి లేఖ రాశామని... ప్రభుత్వ జీవో రాగానే వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తామన్నారు. ఉద్యోగ నియామకాలకు కొత్త పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షలను పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా నిర్వహిస్తామన్నారు.

No comments:

Post a Comment