చిన్న వయసులోనే పెద్ద జీతాలు! Navatelangana media

ఇంటర్మీడియట్ పూర్తిచేసిన అభ్యర్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని కొన్ని విభాగాలు, బ్యాంకులు పలు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. మరికొన్ని విభాగాలు ఉన్నత విద్యను అందించడంతోపాటు ఉద్యోగాల్లో కూడా చేర్చుకుంటున్నాయి. చిన్నవయసులోనే పెద్ద జీతాలు వచ్చే ఈ ఉద్యోగాల్లో చేరితే అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు పడే వారికి ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు వరమనే చెప్పాలి.ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు అందించే సంస్థల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేలు, త్రివిధ దళాలు, పోస్టల్ శాఖ, అటవీశాఖ, పోలీస్ బోర్డులను ప్రధానంగా పేర్కొనవచ్చు. వీటిలో కొన్ని ఏటా క్రమం తప్పకుండా ఉద్యోగ పరీక్షలు నిర్వహిస్తుంటే, మరికొన్ని వాటి అవసరాలను అనుసరించి ప్రకటనలు వెలువరిస్తున్నాయి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంటర్ అభ్యర్థులకు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో క్లరికల్ స్థాయి ఉద్యోగాల భర్తీకి 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10+2) ఎగ్జామినేషన్' నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ), స్టోర్స్ క్లర్క్ వంటి పోస్టులను భర్తీ చేస్తోంది.
ఎంపిక: టైర్-1 పేరుతో మొదట రాత పరీక్ష అందరికీ జరుగుతుంది. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. టైర్-2లో...
1) డేటా ఎంట్రీ ఆపరేటర్లకు కంప్యూటర్‌పై స్కిల్ టెస్ట్ ఉంటుంది.
2) లోయర్ డివిజన్ క్లర్కులకు టైపింగ్ టెస్టు ఉంటుంది.
టైర్-1లో కనీస అర్హత మార్కులు సాధించాలి. తర్వాతే స్కిల్ టెస్టు నిర్వహిస్తారు.
వీటిలో విజయం సాధిస్తే చాలు. ఇంటర్వ్యూలు ఉండవు. నేరుగా నియామకం ఉత్తర్వులను అందుకుంటారు.
వెబ్‌సైట్: http://ssc.nic.in

పోస్టల్ డిపార్ట్‌మెంట్ 
భారతీయ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఇంటర్ అర్హతతో అసిస్టెంట్ హోదా ఉద్యోగాలను అందిస్తోంది. అవి..
1) పోస్టల్ అసిస్టెంట్లు
2) సార్టింగ్ అసిస్టెంట్లు
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కనీస విద్యార్హత. టైపింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ప్రాధాన్యం ఇస్తారు. వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆప్టిట్యూడ్ టెస్ట్, కంప్యూటర్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఆబ్జెక్టివ్) 100 మార్కులకు ఉంటుంది. కంప్యూటర్ టెస్టులో అభ్యర్థి చూపిన ప్రతిభ ఆధారంగా మార్కులు లెక్కిస్తారు. ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఖాళీలు ఏర్పడినప్పుడు ప్రకటనలు వస్తుంటాయి.
వెబ్‌సైట్: www.indianpost.gov.in

స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామినేషన్భారతీయ రైల్వేల్లో మెకానికల్ విభాగంలో స్పెషల్ క్లాస్ అప్రెంటీస్ సిబ్బంది నియామకానికి సంబంధించిందే 'స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామినేషన్'.
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌లో కనీసం 50 శాతం మార్కులు పొందిన వారు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. వయసు 17 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా దేహదారుఢ్య ప్రమాణాలను నిర్దేశిస్తారు.
ఎంపిక: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశ వ్యాప్తంగా రాత పరీక్ష నిర్వహిస్తుంది. దీన్లో పార్ట్ -1, పార్ట్ -2 ఉంటాయి.
* పార్ట్-1 లో జనరల్ నాలెడ్జ్, సైకాలజీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులపై ప్రశ్నలు ఉంటాయి.* పార్ట్ -2 పర్సనాలిటీ టెస్ట్‌కు సంబంధించింది.
శిక్షణ: అర్హులైన వారికి 4 సంవత్సరాలు మెకానికల్ ఇంజినీరింగ్‌లో శిక్షణ ఇస్తారు. రాంచీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్)తో చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా ఈ శిక్షణ ఉంటుంది. సమర్ధంగా శిక్షణ పూర్తిచేసిన వారికి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీని అందజేస్తారు. తర్వాత రైల్వేలోని మెకానికల్ విభాగంలో మెకానికల్ ఇంజినీర్లుగా నియమిస్తారు.
వెబ్‌సైట్: http://www.upsc.gov.in

రైల్వేలు
భారతీయ రైల్వే వ్యవస్థ మన దేశంలో ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న సంస్థగా గుర్తింపు పొందింది. వీటిలో నాన్- టెక్నికల్/ టెక్నికల్ విభాగాలు ఉంటున్నాయి. ఇంటర్ అర్హతతో నాన్ టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగాలను పొందవచ్చు. వీటిలో కమర్షియల్ క్లర్క్, గూడ్స్ గార్డ్ మొదలైనవి ఉంటున్నాయి. వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దీన్లో జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అరిథ్‌మెటిక్ విభాగాలు ఉంటాయి. ఇంటర్వ్యూ ఉండదు.
వెబ్‌సైట్: http://rrbsecunderabad.nic.in/

త్రివిధ దళాలుదేశ రక్షణ బాధ్యత వహించే త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఏటా క్రమం తప్పకుండా క్రమం తప్పకుండా నియామకాలు జరుగుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి ...
ఎన్‌డీఏ అండ్ నావెల్ అకాడమీ ఎగ్జామినేషన్నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)కి సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో చేరేందుకు, ఇండియన్ నావెల్ అకాడమీ నిర్వహించే శిక్షణ కోర్సులో చేరేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి ఏటా 'ఎన్‌డీఏ అండ్ నావెల్ అకాడమీ' పరీక్షను నిర్వహిస్తోంది.ఈ పరీక్ష ప్రతి సంవత్సరం రెండు సార్లు జరుగుతుంది.
అర్హతలు: అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు.
1) నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరిధిలోని ఆర్మీ వింగ్‌కు ఇంటర్‌లో ఏ గ్రూపు పూర్తి చేసిన వారైనా అర్హులే.
2) నేషనల్ డిఫెన్స్ అకాడమీకి చెందిన నావెల్ వింగ్స్, ఎయిర్‌ఫోర్స్‌తోపాటు ఇండియన్ నావెల్ అకాడమీకీ
* చెందిన 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌లో చేరేందుకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్థులై ఉండాలి. వయసు 161/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి.* ఎంపిక నిమిత్తం ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్ష, ఇంటర్వ్యూలు జరుగుతాయి. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.* పేపర్ -1 మ్యాథమేటిక్స్‌కు సంబంధించింది.* పేపర్ -2 జనరల్ ఎబిలిటీ టెస్ట్‌కు సంబంధించింది.* రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ఉంటుంది.
శిక్షణ: అన్ని పరీక్షలో అర్హులైన వారిని శిక్షణ కోర్సుకు ఎంపిక చేస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏ విభాగానికి ఎంపికైనా అందరికీ పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మూడేళ్ల పాటు శిక్షణ ఇస్తారు. మొదటి రెండున్నర సంవత్సరాలు అన్ని విభాగాల అభ్యర్థులకు ఒకేరకమైన శిక్షణ ఇస్తారు. ఇక్కడ తమ ట్రేడ్‌లకు చెందిన శిక్షణ కూడా అందిస్తారు. అభ్యర్థి ఎంచుకున్న విభాగాన్నిబట్టి బీఏ, బీఎస్సీ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) డిగ్రీలను ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. నావెల్ అకాడమీకి చెందిన 10 + 2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ అభ్యర్థులకు బీటెక్ డిగ్రీ ప్రదానం చేస్తారు. తర్వాత...
1) ఆర్మీ క్యాడెట్‌లకు ఇండియన్ మిలటరీ అకాడమీ డెహ్రాడూన్‌లో సంవత్సరంపాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన వారికి లెఫ్టినెంట్ హోదా ఇస్తారు.
2) నావెల్ అకాడమీకి ఎంపికైన నావీ విభాగం వారికి ఎజిమలైలోని ఇండియన్ నావెల్ అకాడమీలో సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. తర్వాత వీరికి సబ్ లెఫ్టినెంట్ హోదా ఇస్తారు.
3) నావెల్ అకాడమీకి చెందిన 10+2 క్యాడెంట్ ఎంట్రీ స్కీమ్ అభ్యర్థులకు బీటెక్ డిగ్రీ ప్రదానం, శిక్షణ తర్వాత 'ఎగ్జిక్యూటివ్ లేదా టెక్నికల్' బ్రాంచీల్లో ఇంజినీర్లుగా నియమిస్తారు.
4) ఎయిర్‌ఫోర్స్ క్యాడెట్‌లకు హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. ఇది ఏడాదిన్నరపాటు ఉంటుంది. తర్వాత వీరికి ఫ్లయింగ్ ఆఫీసర్ హోదా ఇస్తారు.... Click here for Latest Notification Details 
వెబ్‌సైట్: http://www.upsc.gov.in.
రక్షణ మంత్రిత్వ శాఖలో టెలిఫోన్ ఆపరేటర్లు
రక్షణ మంత్రిత్వ శాఖ ఇంటర్ విద్యార్హతతో టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీచేస్తోంది.
ఈ పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక నిమిత్తం రాత పరీక్ష నిర్వహిస్తారు. నోటిఫికేషన్లు ఎంప్లాయ్‌మెంట్‌న్యూస్, దినపత్రికల్లో వస్తుంటాయి. దరఖాస్తులను ఎక్కడి పంపాలనేది ప్రకటనలో పేర్కొంటారు.
ఇ-మెయిల్: sqaelmumbai-dgqa@nic.in

ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మన్
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 'ఎయిర్‌మన్' ఉద్యోగాలకు తరచూ ప్రకటనలు వస్తుంటాయి. దీన్లో గ్రూప్ 'ఎక్స్' (టెక్నికల్), గ్రూప్ 'వై' (ఆటో టెక్నీషియన్, గ్రౌండ్ ట్రెయినింగ్ ఇన్‌స్ట్రక్టర్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (పోలీస్) ట్రేడ్‌లు ఉంటాయి. ఎంపిక నిమిత్తం రాతపరీక్ష నిర్వహిస్తారు. కేవలం పురుషులు మాత్రమే అర్హులు.
1) గ్రూప్ 'ఎక్స్' (టెక్నికల్) ట్రేడ్‌లకు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి.
2) గ్రూప్ 'వై' (ఆటో టెక్, జీటీఐ, ఐఏఎఫ్ (పి) ట్రేడ్‌లకు): ఇంటర్ ఏ గ్రూప్ చదివినా కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. వయసు 16 1/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య.
* అర్హులైన వారికి ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో ఉత్తీర్ణత సాధించిన వారికి దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత ఇంటర్వ్యూ ఉంటాయి.
వెబ్‌సైట్: www.careerairforce.nic.in

క్యాడెట్ (బీటెక్) ఎంట్రీ స్కీమ్
ఇండియన్ నేవీ విభాగం ఇంటర్ అభ్యర్థులకు పర్మనెంట్ కమిషన్ కింద 10+2 క్యాడెట్ (బీటెక్) ఎంట్రీ స్కీమ్ ద్వారా ఉద్యోగాలను ఇస్తోంది. కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి.
అర్హతలు: ఇంటర్‌లో సైన్స్ సబ్జెక్టులతో కనీసం 70 శాతం మార్కులు. వయసు 17 1/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎత్తు 157 సెం.మీ.లు ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా దేహ దారుఢ్య ప్రమాణాలను నిర్దేశిస్తారు.
ఎంపిక: సర్వీస్ సెలక్షన్ బోర్డు అర్హులైన వారికి 5 రోజుల పాటు వివిధ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇవి రెండు దశల్లో జరుగుతాయి.
* స్టేజ్-1 (ఒక్క రోజు మాత్రమే)లో ఇంటెలిజెన్స్ టెస్టులు, పిక్చర్ పర్సెప్షన్ టెస్టులు ఉంటాయి. దీన్లో అర్హత సాధించిన వారికి స్టేజ్-2 (4 రోజులు) టెస్టులు నిర్వహిస్తారు. ఇక్కడ సైకలాజికల్ టెస్టులు, గ్రూప్ టాస్క్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఉంటాయి.* అన్ని పరీక్షల్లో అర్హత సాధించిన వారిని క్యాడెట్‌లుగా తీసుకుని బీటెక్ ( ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్) కోర్సులో శిక్షణ ఇస్తారు.* కాలవ్యవధి 4 సంవత్సరాలు. కోర్సు పూర్తయిన తర్వాత వీరికి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ బీటెక్ డిగ్రీ ప్రదానం చేస్తుంది. శిక్షణ పూర్తిచేసిన వారిని 'ఎగ్జిక్యూటివ్ లేదా టెక్నికల్' (ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ లేదా నావెల్ ఆర్కిటెక్ట్) బ్రాంచీల్లో నియమిస్తారు.
వెబ్‌సైట్: www.nausena-bharti.nic.in

ఏవియేషన్ కేడర్ అబ్జర్వర్
భారత నౌకాదళం (ఇండియన్ నేవీ) ఏవియేషన్ కేడర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో 'అబ్జర్వర్‌'గా (షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్) నియామకాలు చేపడుతుంటుంది.
అవివాహితులైన స్త్రీ, పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హులైన వారిని సర్వీస్ సెలక్షన్ బోర్డ్ రెండు దశల్లో ఎంపిక చేస్తుంది. ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారికి ఆఫీసర్లుగా సబ్-లెఫ్టినెంట్ హోదాలోశిక్షణ ఇస్తారు.
* శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన వారిని సబ్- లెఫ్టినెంట్ హోదాలో నియమిస్తారు.
వెబ్‌సైట్: www.nausena-bharti.nic.in

సెయిలర్లు
భారత నౌకాదళం ఇంటర్ అర్హతతో 'సెయిలర్‌'గా చేరేందుకు తరచూ ప్రకటనలు ఇస్తుంటుంది. వీటికి అవివాహిత పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లతోపాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్స్ సబ్జెక్టుల్లో ఏదో ఒకదాన్ని చదివి ఉండాలి. 16 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు అర్హులు. ఎత్తు కనీసం 157 సెం.మీ. అవసరం.
ఎంపిక: అర్హులైన వారికి మొదట ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్ష ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారికి శిక్షణ ఇస్తారు. తర్వాత సెయిలర్లుగా నియమిస్తారు.
వెబ్‌సైట్: www.nausena-bharti.nic.in

పోలీస్ కానిస్టేబుళ్లురాష్ట్రంలో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇంటర్‌లో ఉత్తీర్ణులైన వారికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. పోస్టుల వివరాలు...
1) స్త్టెపెండరీ క్యాడెట్ ట్రెయినీ కానిస్టేబుళ్లు (సివిల్ - పురుషులు)
2) ఎస్‌సీటీ పోలీస్ కానిస్టేబుళ్లు (ఏఆర్ పురుషులు).
3) ఎస్‌సీటీ పోలీస్ కానిస్టేబుళ్లు (సివిల్ - మహిళలు)
4) ఎస్‌సీటీ పోలీస్ కానిస్టేబుళ్లు (ఏఆర్ మహిళలు).
అర్హతలు: ఇంటర్ ఏ గ్రూప్ ఉత్తీర్ణులైన వారైనా దరఖాస్తు చేయవచ్చు. వయసు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. పురుషులు 167.6 సెం.మీ. ఎత్తు, మహిళలు 157.5 సెం.మీ. ఎత్తుఉండాలి.
ఎంపిక: మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో పరుగు పందెం, రెండో దశలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఉంటాయి. వీటిలో అర్హులైన వారికి మూడో దశ- రాత పరీక్ష ఉంటాయి. దీన్లో అర్హత సాధిస్తే ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
వెబ్‌సైట్: www.apstatepolice.org
అటవీ శాఖ
రాష్ట్ర అటవీశాఖ ఇంటర్ అర్హతతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.
ఈ పోస్టులకు అర్హతలు: అభ్యర్థి ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: మొదట శారీరక కొలతల పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో అర్హత సాధిస్తే రాత పరీక్షకు ఆహ్వానిస్తారు. రాత పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి.
పేపర్-1: ఎస్సే రైటింగ్ (ఇంగ్లిష్, తెలుగు, హిందీ లేదా ఉర్దూ భాషల్లో రాయవచ్చు).
పేపర్ -2: జనరల్ నాలెడ్జ్.
పేపర్-3: జనరల్ మ్యాథమెటిక్స్.
అన్ని పేపర్లలో కనీసం 35 శాతం మార్కులు రావాలి. సగటున 40 శాతం ఉండాలి. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి వాకింగ్ టెస్ట్, వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
* వాకింగ్ టెస్ట్: ఇక్కడ పురుషులు 4 గంటల్లో 25 కిలో మీటర్లను నడవాలి. మహిళా అభ్యర్థులు 4 గంటల్లో 16 కిలో మీటర్లు నడవాలి.
అన్ని పరీక్షల్లో చూపిన ప్రతిభ కొలమానంగా తుది ఎంపిక జరుగుతుంది.
వెబ్‌సైట్: http://forest.ap.nic.in/
Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment