ఉద్యోగాల భర్తీకి సర్కారు సై! | |
* రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో షెడ్యూల్ విడుదల? * కార్పొరేషన్ల నియామకాలు కూడా టీఎస్‌పీఎస్‌సీ పరిధికి
, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తామని ప్రభుత్వం ప్రకటించి ఏడాది కావస్తున్నా ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు. జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా నియామకాల షెడ్యూల్‌ను ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తుచేస్తోంది. శాఖలవారీగా ఖాళీపోస్టుల సమాచారాన్ని ప్రభుత్వం ఇప్పటికే తెప్పించుకుంది. తాజాగా శనివారం వివిధ శాఖల్లో ఖాళీల వివరాలపై నివేదికలను కోరింది. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని అత్యవసర పోస్టులను ప్రాధాన్యక్రమంలో భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతోన్న నేపథ్యంలో ఈ సంవత్సరంలోగా భర్తీచేసే పోస్టుల వివరాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. వచ్చే డిసెంబరులోగా 26వేల పోస్టుల వరకు భర్తీ చేయాలన్న వ్యూహంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. సంబంధిత ప్రకటనల జారీకి వీలుగా టీఎస్‌పీఎస్‌సీని కూడా అప్రమత్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో జూన్ తొలివారంలోగా మూడువేల పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీకావచ్చని టీఎస్‌పీఎస్‌సీ అధికారులు చెప్తున్నారు. రానున్న రెండుమూడు నెలల్లో మరో 15 వేల పోస్టుల భర్తీకి కూడా టీఎస్‌పీఎస్‌సీ సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది.
కార్పొరేషన్ల నియామకాలు కూడా...టీఎస్‌పీఎస్‌సీ ద్వారా వివిధ కార్పొరేషన్ల పరిధిలోని ఖాళీలను సైతం భర్తీచేయించాలని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీ వ్యవహారాలనే ఇప్పటివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూస్తోంది. ఇకనుంచి ఆ నియామకాలు కూడా టీఎస్‌పీఎస్‌సీ ద్వారా జరగనున్నాయి. తొలిదశలో తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్‌లోని 300 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. |
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment