బీఎస్ఎన్ఎల్‌లో 962 జేఏవో పోస్టులు
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: డిసెంబర్ 1, 2014
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 31, 2014
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 22, 2015
పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అందుబాటులోని పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, బెంగళూరు, భువనేశ్వర్‌లు
బేసిక్ పే: రూ.16400-40500
వయోపరిమితి: 2015 జనవరి 1 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, ఓసీ పీహెచ్ అభ్యర్థులకు పదేళ్లు, ఓబీసీ పీహెచ్ అభ్యర్థులకు 13 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ పీహెచ్ అభ్యర్థులకు 15 ఏళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి)
పరక్ష ఫీజు: రూ. 1000 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు) ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి అయ్యే ప్రయాణ ఖర్చులను (టీఏ) కూడా బీఎస్ఎన్ఎల్ చెల్లిస్తుంది.
రాత పరీక్ష ఇలా:
మొత్తం 450 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో ప్రశ్నపత్రానికి వ్యవధి 3 గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే అడుగుతారు. పేపర్ 1కి 150 మార్కులు కేటాయించారు. ఇందులో 100 మార్కులకు జనరల్ ఇంగ్లిష్, 50 మార్కులకు జనరల్ ఆప్టిట్యూడ్, అవేర్‌నెస్ అంశాలపై ప్రశ్నలుంటాయి. పేపర్ 2కి 300 మార్కులు కేటాయించారు. ఇందులో ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, కాస్ట్ అకౌంటింగ్, ట్యాక్స్ అండ్ కమర్షియల్ లాస్ అంశాల నుంచి ప్రశ్నలొస్తాయి.
ఇంగ్లిష్ విభాగం నుంచి కాంప్రహెన్షన్ పాసేజ్‌లు, వ్యాకరణం, పదసంపద, యూసేజ్‌ల్లో ప్రశ్నలుంటాయి.
పేపర్ 1లోజనరల్ అవేర్‌నెస్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తాజా పరిణామాలపై ప్రశ్నలు అడుగుతారు. పాలిటీ, ఎకానమీలపైనా ప్రశ్నలొస్తాయి. ఆప్టిట్యూడ్‌కి సంబంధించి జనరల్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, క్వాంటిటేటివ్ విభాగాల్లో అభ్యర్థులను పరీక్షిస్తారు.
పేపర్ 2లో అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్, ఆడిటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఇన్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్, బేర్‌యాక్ట్స్ విభాగాల్లో ప్రశ్నలుంటాయి.
ఎంపిక ఇలా:
అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లోనూ నిర్ణీత కటాఫ్ మార్కులు సాధించాలి. వీటిని బీఎస్ఎన్ఎల్ నిర్ణయిస్తుంది. కటాఫ్ మెరిట్ ప్రకారం అర్హులైన అభ్యర్థులను ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఎంపికైనవాళ్లు రెండేళ్లపాటు ప్రొబేషన్‌లో ఉంటారు. అనంతరం శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారు.
0 comments:
Post a Comment