ప్రాజెక్ట్ వర్క్ గా తెలంగాణా ఉధ్యమం
ఖండాలు దాటిన తెలంగాణ ఉద్యమం ఇప్పుడొక అధ్యయనానికి వేదికైంది. దేశ చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో ఒక ప్రాంత ప్రజలంతా ముక్తకంఠంతో ప్రత్యేకరాష్ట్రం కోసం రగల్‌జెండా ఎగురవేయడం ప్రపంచాన్ని ఆకర్షించింది. దేశ,విదేశాల్లోని విద్యార్థులు ఉద్యమాన్ని పరిశోధన అంశంగా ఎంచుకుంటున్నారు. ఇప్పటికే యూరప్‌లోని పలు యూనివర్సిటీల నుంచి విద్యార్థులు ఉద్యమతీరు తెన్నులను అధ్యయనం చేశారు. తాజాగా జర్మనీలోని బెర్జీనిస్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న లారెన్స్ తెలంగాణ ఉద్యమాన్ని నేపథ్యాన్ని ప్రాజెక్టుగా ఎంచుకున్నాడు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలాన్ని మంగళవారం ఆయన సందర్శించి ఉద్యమ వివరాలను సేకరించాడు. ఉద్యమం యావత్‌దేశాలను ఆకర్షించిందని తెలిపాడు


0 comments:
Post a Comment