రైల్వేలో 17000 వేల ఉద్యోగాల భర్తీ - సదానంద గౌడ
మౌలాలిలోని అర్పీఎఫ్ శిక్షణా కేంద్రలో శుక్రవారం నిర్వహించిన 53 వ బ్యాచ్ ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ కు కేంద్ర రైల్వే మంత్రి సదానందా గౌడ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ..రైల్వేలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. అదే విదంగా మౌలాలీ రైల్వే పోలీస్ శిక్షణా కేంద్రాన్ని జాతీయ స్థాయి శిక్షణా కేంద్రంగా తీర్చిదిదుతామని ఈ సందర్భంగా సదానంద గౌడ చెప్పారు. అంతేకాకుండా మహిళల భద్రతకు పూర్తి ప్రాధాన్యత ఇస్తామని రానున్న రోజుల్లో రైల్వేలో 32 కంపెనీల మహిళా కాని స్టేబుళ్ల నియామకం చేపట్టనున్నట్లు వివరించారు.
0 comments:
Post a Comment