రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలు లక్షకుపైనే

రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలు లక్షకుపైనే 


HYE14COMPUTER_TRAIN_479255gTSPSC ఏర్పాటుతో లక్షలాది మంది నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఇన్నాళ్లు ఊరిస్తూ వచ్చిన ఉద్యోగ  నోటిఫికేషన్లు  త్వరలో రాబోతున్నాయి.  అసలు ఉద్యోగాలు వస్తాయా …రావా…?….అసలేం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్న నిరుద్యోగుల్లో పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది.
వీఆర్వో, వీఆర్ఏ తర్వాత…గతేడాది వీఆర్వో, వీఆర్ఏ మినహాయించి ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ ప్రకటన లేదు. అలాగే  2011 గ్రూప్ -1, గ్రూప్ -2 నోటిఫికేషన్లు తప్స కొత్త నోటిఫికేషన్ లేదు. అవి కూడా సుప్రీం కోర్టు గడప ఎక్కడంతో రద్దయ్యాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ కోసం… చకోరా పక్షుల్లా ఎదురుచూస్తున్నారు అభ్యర్థులు.  ప్రత్యేక రాష్ట్రంలోనైనా  ఉద్యోగాలు రాకపోతాయా అనే ఆశతో ఉన్నారు  నిరుద్యోగులు.
అభ్యర్థుల ఆశలకు తగ్గట్టే డిపార్ట్ మెంట్స్ వారీగా ఖాళీలను ప్రభుత్వమే ప్రకటించింది. టీఎస్ పీఎస్ సీ చైర్మన్ ఘంటా చక్రపాణి కూడా  …. వచ్చే ఏడాదిని ఉద్యోగ నామ సంవత్సరంగా  ప్రకటించడంతో  అభ్యర్థుల్లో కూడా ఎక్స్ పెక్టేషన్స్  కూడా హెవీగా పెరుగుతున్నాయి.
వివిధ శాఖల్లో…ప్రభుత్వ లెక్కల ప్రకారమే లక్షా 7 వేల 744 ఉద్యోగ ఖాళీలున్నాయి. ఇందులో  పాఠశాల విద్యాశాఖలో 24 వేల 861, ఉన్నత విద్యాశాఖలో 10 వేల 592, హోంశాఖలో 15 వేల 339, రెవెన్యూ శాఖలో 10 వేల 142, సచివాలయంలో 510 ఖాళీలున్నట్టు అధికార వర్గాలు ప్రకటించాయి. విభాగాల వారిగా ఖాళీల కసరత్తు జరుగుతోంది.  అంటే ఇంకా మరిన్ని ఉద్యోగ ఖాళీలు  పెరిగే అవకాశం ఉంది. ఇంకేముంది ఇక కొత్త సంవత్సరం లో అభ్యర్థులు కొలువుల కోసం క్యూ కట్టాల్సిందే
Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment