23 September 2017

దీపావళి బంపర్ ఆఫర్ : రూ.1కే షియోమీ స్మార్ట్‌ఫోన్

దీపావళి బంపర్ ఆఫర్ : రూ.1కే షియోమీ స్మార్ట్‌ఫోన్

mi offersజియో దెబ్బకు బడా కంపెనీల నుండి చిన్న చిన్న కంపెనీలు కూడా ఆఫర్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు వెయ్యి నుంచి రూ. 1500 వరకు ఉండే ఆఫర్లతో ప్రకటించిన కంపెనీలు ఉండగా..ఇప్పుడు ఏకంగా కేవలం రూ.1కే స్మార్ట్ ఫోన్ అంటూ సంచలనం రేపుతోంది చైనాకు చెందిన షియోమీ కంపెనీ. చైనాకు చెందిన మొబైల్ తయారీదారు షియోమీ దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక సేల్‌ను నిర్వహించనుంది. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు షియోమీ తన పార్ట్‌నర్ సైట్లలో దీపావళి సేల్‌ను నిర్వహిస్తున్నది. దీంతోపాటు తన ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో ఎంఐ సేల్‌ను కూడా నిర్వహించనుంది. ఇందులో రూ.1కే పలు షియోమీ ఫోన్లను పొందే అవకాశం కల్పిస్తోంది. అదే విధంగా షియోమీకి చెందిన పలు ఇతర ఉత్పత్తులపై రాయితీలను కూడా అందించనుంది.
సేల్ జరగనున్న తేదీల్లో ప్రతి రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రూ.1 సేల్ కొనసాగుతుంది. ఇందులో రెడ్‌మీ నోట్ 4, ఎంఐ రూటర్ 3సీ, రెడ్‌మీ 4, ఎంఐ బ్లూటూత్ మినీ స్పీకర్, ఎంఐ సెల్ఫీ స్టిక్, రెడ్‌మీ 4ఎ, ఎంఐ బ్యాండ్ హెచ్‌ఆర్‌ఎక్స్ ఎడిషన్, ఎంఐ క్యాప్సూల్ ఇయర్‌ఫోన్స్, ఎంఐ వైఫై రిపీటర్, ఎంఐ బ్యాక్‌ప్యాక్, ఎంఐ వీఆర్ ప్లేలను కేవలం రూ.1కే పొందేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా సేల్ జరిగే రోజుల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు యాప్‌లో బిడ్ టు విన్ సేల్ ను నిర్వహించనున్నారు.
ఇవే కాకుండా సేల్ సందర్భంగా షియోమీ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీ రాయితీలను అందివ్వనున్నారు. ఆయా ఉత్పత్తులపై కనీసం రూ.100 రాయితీ మొదలుకొని గరిష్టంగా రూ.2500 వ‌ర‌కు డిస్కౌంట్లను అందివ్వనున్నారు

No comments:

Post a Comment