23 September 2015

మరో 3 ఉద్యోగ నోటిఫికేషన్లు

మరో 3 ఉద్యోగ నోటిఫికేషన్లు
* టీఎస్‌పీఎస్‌సీ ద్వారా 283 పోస్టుల భర్తీ 
* నేటి నుంచి దరఖాస్తు చేసుకునే వీలు 
* ఈ మూడు పరీక్షలూ నవంబరులోనే.. 
* పోలీసు శాఖలో నియామకాలకు మరికొంత వ్యవధి 
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నుంచి నోటిఫికేషన్ల జారీ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని ఉద్యోగ ప్రకటనలు ఇచ్చిన కమిషన్ మంగళవారం(సెప్టెంబరు 22న) మరో మూడు ప్రకటనలు విడుదల చేసింది. సెప్టెంబరు 20న 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఏఈఈ) సివిల్ ఇంజినీరింగ్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధమవుతున్న టీఎస్‌పీఎస్‌సీ తాజాగా మరికొన్ని ఉద్యోగాలకు పచ్చజెండా ఊపింది. మూడు శాఖల్లో మొత్తం 283 ఖాళీలను భర్తీ చేస్తారు.

No comments:

Post a Comment