తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి కానుకలు సిద్ధమవుతున్నాయి. భారీఎత్తున ఉద్యోగ నియామక ప్రకటనలు, ఒప్పంద కార్మికుల సేవల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఆరోజు జారీకానున్నాయి. జూన్ 2 నాటికి రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన అంశాలపై తెరాస ప్రభుత్వం దృష్టి సారించింది. చాలా హామీలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉద్యోగ నియామకాల ప్రక్రియే ఇంకా ప్రారంభంకాలేదు. కమలనాథన్ కమిటీ ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాకపోవడంతో రాష్ట్రస్థాయి నియామకాలను ప్రభుత్వం చేపట్టడంలేదు. మరోవైపు నిరుద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో విభజనతో సంబంధంలేని ఉద్యోగ నియామకాలను చేపట్టాలని సర్కారు భావిస్తోంది. పంచాయతీరాజ్‌లో నియామకాలకు ఉత్తర్వులు వెలువడినా, అవి సాంకేతిక అభ్యర్థులకు చెందినవి. అన్నివర్గాల నిరుద్యోగులకు అవకాశాలు కల్పించేలా భారీఎత్తున ఉత్తర్వులు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్నిశాఖల నుంచి ఖాళీల వివరాలను సేకరించింది. గ్రూపు-1, గ్రూపు-2తో పాటు దాదాపు 17 శాఖలకు చెందిన వేలాది ఉద్యోగాల భర్తీకి ఆవిర్భావ దినాన ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశముంది.
ఒప్పంద ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరిస్తామని తెరాస ఎన్నికల ప్రణాళికలో తెలిపింది. హామీని వందశాతం నెరవేర్చుతామని కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. వైద్యారోగ్యశాఖలో బహుళవిధ ఆరోగ్యకార్యకర్తలు తదితర ఉద్యోగుల నియామకాలు రోస్టర్, ప్రతిభ ఆధారంగా జరిగాయి. క్రమబద్ధీకరణకు సమస్య లేదు. వారిని నేరుగా భర్తీచేయాలా, ఖాళీల్లో చేర్చాలా అన్న సందిగ్ధత తొలగి.. ప్రభుత్వానికి స్పష్టత వచ్చింది. క్రమబద్ధీకరణ దస్త్రం ముఖ్యమంత్రికి చేరింది. దీనిని ఆయన ఆమోదించి, ఆవిర్భావ దినోత్సవాన ప్రకటించనున్నారు. ఈ నిర్ణయంతో 18వేల మంది నిరీక్షణ ఫలించనుంది. మరిన్ని శాఖలకు సంబంధించి నిర్ణయం ప్రకటనకు రంగం సిద్ధమవుతోంది.

Blogger Comment
Facebook Comment