* రెండు రోజుల్లో సమర్పించాలని అన్ని శాఖలకు తెలంగాణ సర్కారు ఆదేశం
తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్‌లో నియామకాలను చేపట్టేందుకు యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయి పోస్టుల్లో ఖాళీల వివరాలను ఇవ్వాలని అన్ని శాఖలకు తాజాగా ఆదేశాలు జారీచేసింది. రెండు రోజుల్లో సమాచారం అందించాలని సూచించింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కార్యకలాపాలు ప్రారంభమయ్యాక ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఉద్యోగుల విభజనతో సంబంధం లేనివాటిని వెంటనే భర్తీ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సింగరేణి, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ తదితర శాఖల్లో పోస్టుల భర్తీకి సర్కారు నిర్ణయించింది. జిల్లా స్థాయిలోనూ మరికొన్ని నియామకాలు చేపట్టాలని భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. మరోవైపు కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల అమలుకు మార్చి వరకు గడువుంది. దీంతో ఆ తర్వాతే నియామకాలు జరగవచ్చని భావిస్తున్నారు
|
No comments:
Post a Comment