ఆగండి .. కోచింగ్ కు వెళ్తున్నారా ?
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరింత సమయం పడుతుంది. నాలుగు నుండి ఆరునెలల తరువాతనే ఉద్యోగాల ప్రక్రియ మొదలవుతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి ఇంతకుముందే వెల్లడించిన విషయం తెలిసిందే. కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత అందులో తెలంగాణ రాష్ట్రానికి, ఉద్యమానికి సంబంధించిన సిలబస్ ను చేరుస్తున్నామని, సిలబస్ మార్పులు, చేర్పుల అనంతరమే ఉద్యోగ నియామకాలు ఉంటాయని ఆయన నోటిఫికేషన్ల ఆలస్యానికి గల కారణాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి సిలబస్ కాకుండా కొత్త సిలబస్ చేరుస్తున్నామని, ప్రతి ఉద్యోగికి తెలంగాణ చరిత్ర, ఉద్యమం తెలిసి ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే నిపుణుల కమిటీ ఏర్పాటు అవుతుందని, ఆ తరువాతనే ఉద్యోగాలు ఉంటాయని ఘంటా చక్రపాణి తెలిపారు. తొందరపడి నిరుద్యోగులు, విద్యార్థులు కోచింగ్ సెంటర్లకు వెళ్లొద్దని, డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు. సిలబస్ వచ్చిన తరువాతనే కోచింగ్ తీసుకోవాలని సూచించారు.

0 comments:
Post a Comment