రూ.75 లక్షల వార్షిక వేతనంతో సంచలనం
అమెరికా కంపెనీ గూగుల్‌లో రూ.75 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్‌వేర్ డెవలపింగ్ ఇంజినీర్‌గా నియమితులైన తోటకూరి శ్రీమేఘన జిల్లా వాసి కావడం గర్వకారణం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజుల్‌రావుపేటకు చెందిన మేఘన చిన్ననాటి నుంచి చదువులో చురుకుగా ఉండేవారు. జాతీయస్థాయి ఐఐటీలో 52వ ర్యాంకు సాధించి 2010లో ఆమె సంచలనం సృష్టించారు. రికార్డుస్థాయి వేతనంతో ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కారు. శ్రీమేఘన తల్లిదండ్రులు ఉన్నత ఉద్యోగాలు చేస్తుండగా..ఆమె పెదనాన్నల పిల్లలు కూడా చదువుల్లో రాణిస్తున్నారు. మంచి ఉద్యోగాలూ పొందారు. జిల్లా ప్రతిష్టను నలుదిశలా చాటుతున్నారు.
కూసుమంచి: కూసుమంచి మండల ఖ్యాతిని ప్రపంచస్థాయికి చేర్చింది తోటకూరి శ్రీమేఘన. అమెరికా సాఫ్ట్‌వేర్ కంపెనీ గూగుల్‌లో రూ.75 లక్షల వార్షిక వేతనంతో ఆమె సంచలనం సృష్టించారు. మండలంలోని జుజుల్‌రావుపేటకు చెందిన తోటకూరి శ్రీనివాస్ ప్రథమ కుమార్తె శ్రీమేఘన ఇప్పుడో హాట్ టాపిక్. కళ్లు చెదిరే వేతనంతో ప్రపంచస్థాయిలో ఉద్యోగం పొందిన తెలుగింటి అమ్మాయి ఘనతను చూసి మండలవాసులు మురిసిపోతున్నారు.
శ్రీ మేఘన తండ్రి తోటకూరి శ్రీనివాస్ 25 సంవత్సరాల క్రితం ఉద్యోగరీత్యా స్వగ్రామం వదిలివెళ్లారు. ప్రస్తుతం ముంబైలోని ఎన్టీపీసీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. జిల్లాకే చెందిన అతని భార్య వాణి కరీంనగర్ జిల్లా రామగుండం ప్రభుత్వ పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరిలో ఒకరు శ్రీమేఘన, మరొకరు అనన్య. పిల్లలిద్దరూ సొంతూరులో గడిపింది తక్కువే అయినా, ఇక్కడ చదువకపోయినా ఊరికి మాత్రం పేరుప్రతిష్టలు తీసుకొస్తున్నారు. శ్రీమేఘన పెదనాన్నలు వెంకటేశ్వరరావు, అప్పారావు, రామారావు, బాబూరావు నాయనమ్మ భద్రమ్మ జుజుల్‌రావుపేటలోనే నివాసం ఉంటున్నారు. మేఘన సాధించిన ఘనత గురించి తెలియగానే వారు ఆనందంలో మునిగి పోయారు.
తమ కుటుంబానికి, తమ ఊరుకు ఇంతటి పేరు దక్కటం అదృష్టంగా భావిస్తున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్ననాటి నుంచి మేఘన చదువులో ఎప్పుడు ఫస్టేనని, 2010లో ఐఐటీ రాసి జాతీయ స్థాయిలో 52వ ర్యాంకు సాధించిందని తెలిపారు. తాను ఎప్పుడో ఒకప్పుడు అద్భుతం సృష్టిస్తుందని తాము ముందే ఊహించామని పెద్దనాన్న రామారావు విలేకరులకు తెలిపారు. తమ అమ్మాయి ఇంత ఖ్యాతిని గడించినందుకు తాము చెప్పలేని ఆనందంలో ఉన్నామన్నారు. శ్రీమేఘన తమ ఊరి అమ్మాయేనని పత్రికల్లో చదివిన గ్రామస్తులు సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. తమ ఊరు పేరు ప్రపంచానికి చాటినందుకు ఉప్పొంగి పోతున్నారు.
విద్యావంతుల కుటుంబంగా....
మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీ మేఘన తండ్రి శ్రీనివాస్ అన్నదమ్ములు ఐదుగురిలో ఆయన ఒక్కరే ఉద్యోగి. మిగిలిన వారు వ్యవసాయదారులే. కానీ వారి పిల్లలు మాత్రం చదువుల్లో రాణిస్తున్నారు. శ్రీనివాస్ కుమార్తె శ్రీ మేఘన గూగుల్‌లో ఉద్యోగం పొందగా అతని సోదరుల కుమారులు సాఫ్ట్‌వేర్ రంగంలోనే దూసుకెళుతున్నారు. వీరిలో అప్పారావు కుమారుడు హరిబాబు కోకోకోలా కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. రామారావుకు ఇద్దరు కుమారులు కాగా పెద్దకుమారుడు అన్వేష్ ఢిల్లీ ఐఐటీ ఇనిస్టిట్యూట్‌లో ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరారు. బాబూరావు కుమారుడు హరీష్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఇలా వారి కుటుంబంలో పిల్లలందరూ చదువులో రాణిస్తున్నారు.
చదువులో ఎప్పుడూ మేటి..
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఉన్నత శిఖరాలకు: శ్రీ మేఘన
జ్యోతినగర్ (కరీంనగర్) : ముంబై ఎన్టీపీసీలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న తోటకూర శ్రీనివాస్-వాణిల పెద్ద కుమార్తె శ్రీమేఘన విద్యాభ్యాసం రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్‌షిప్‌లోని సెయింట్ క్లేర్ పాఠశాల నుంచి మొదలైంది. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆమె అక్కడే చదువుకుంది. 9, 10 తరగతులు విజయవాడ కేకేఆర్ గౌతమ్ స్కూల్‌లో చదివింది. పదో తరగతిలో 97 శాతం మార్కులు సాధించి స్కూల్‌లో మొదటి స్థానం సాధించింది. చైతన్య కళాశాలలో ఇంటర్ ఎంపీసీలో 98 శాతం మార్కులు పొందింది. ఐఐటీలో 52వ ర్యాంకు సాధించి ముంబైలో సీఎస్‌ఈ చివరి సంవత్సరం విద్యనభ్యసిస్తోంది. ఈ క్రమంలో గూగుల్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కు ఎంపికై ప్రపంచస్థాయిలో 87వ ర్యాంకు , జాతీయ స్థాయిలో 27 ర్యాంకు సొంతం చేసుకుని లక్షా15 వేల డాలర్ల వేతనం (75 లక్షలు)తో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉద్యోగం చేసేందుకు అర్హతపొందింది. ఈ సందర్భంగా శ్రీ మేఘన ‘సాక్షి’తో మాట్లాడారు.
పతి వ్యక్తిలో అంతర్గత మెమరీ ఉంటుంది... దానిని సరియైన విధానం లో ఉపయోగించుకోవాలని ఆమె యువతకు సందేశం ఇచ్చారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తానీ ఘనత సాధించానని, అమ్మానాన్న విజయాలకు వారధిగా నిలుస్తున్నారన్నారు.
కుటుంబ వివరాలు
స్వస్థలం: ఖమ్మం జిల్లా

కూసుమంచి మండలం జుజుల్‌రావుపేట
తండ్రి : తోటకూర శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్, ఎన్టీపీసీ
తల్లి : వాణి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, కమాన్‌పూర్ మండలం, చందనాపూర్ గ్రామం, కరీంనగర్
సోదరి : అనన్య, పదో తరగతి

About Unknown
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
0 comments:
Post a Comment