మూడేళ్ళలో సగానికి పడిపోనున్న సాఫ్ట్ వేర్ జాబ్ లు
వారానికి ఐదురోజులే పని. వీకెండ్ లో పార్టీలు. కంప్యూటర్ లతో కుస్తీ పట్టడం… ఇంటర్నేషనల్ కాల్స్ అటెంప్ట్ చేయడం. మస్తీకి మస్తీ…. మనీకి మనీకి అన్నట్టుగా ఉండే సాప్ట్ వేర్ జాబ్స్ ఇకపై అందని ద్రాక్షే అంటోంది ఓ పరిశోధనా సంస్థ. భవిష్యత్తులో యాభై శాతం జాబ్ లు పడిపోవచ్చని… భారీ రిక్రూమెంట్ లు జరగడం కష్టమేనంటోంది. సాఫ్ట్ వేర్ జాబ్ చేయాలని కలకలకంటున్న యూత్…. ఇకపై ఆ ఆశలకు నీళ్లు వదులుకోవల్సిందే అంటోంది ప్రముఖ రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్. 2017 – 18 ఫైనాన్షియల్ ఇయర్ కి ఈ రంగంలో ఉద్యోగ నియామకాలు ప్రస్తుత స్థాయిలో 50% పడిపోవచ్చని తన తాజా నివేదికలో తెలిపింది ఈ ఏజెన్సీ. ఐటీ రంగంలో వస్తున్న మార్పులు…. యాజమాన్యాల ఆలోచనా తీరే దీనికి కారణమంటోంది ఈ సంస్థ. గత కొన్ని సంవత్సరాలుగా లక్షల జాబ్ లను సృష్టించింది. అయితే ఇకపై సీన్ మారే అవకాశముందంటుంది క్రిసిల్. ఏటా ఆదాయం పెరుగుతున్నా…. ప్రతి ఉద్యోగిపై ఖర్చును తగ్గించుకొని… లాభాలు మరింత పెంచుకోవడంపైనే దృష్టి పెడుతున్నాయి ఐటీ సంస్థలు. ఇదే నిరుద్యోగులకు ఇబ్బందికరంగా మారింది. రానున్న రోజుల్లో అనుభవజ్ఞులు… వెల్ ట్రెయిన్డ్ అయిన వారినే ఐటీ సంస్థలు తీసుకోనున్నాయంటోంది క్రిసిల్. ప్రస్తుతం ఐటీ రంగంలో దేశవ్యాప్తంగా 31 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే భవిష్యత్ లో ఇన్ని లక్షల ఉద్యోగాలుండవని.. లేటెస్ట్ టెక్నాలజీ తెలిసినవారికే ఈ రంగంలో స్థానముంటుందని తెలిపింది క్రిసిల్.
0 comments:
Post a Comment