నిరుద్యోగులకు ఆసరా కల్పించడమే మా లక్ష్యం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సృష్టం చేశారు. తెలంగాణలో కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని.. వారందరికీ భరోసా కల్పించడమే తమ ముందున్న కర్తవ్యమని ఆయన తెలిపారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరం మాట్లాడిన ఈటెల.. రాష్ట్రంలో ఐదు లక్షల 23 వేలకు పైగా శాంక్షన్ పోస్టులున్నాయన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య నాలుగు లక్షల 15 వేలకు పైగా ఉందన్నారు.
తెలంగాణలో ఉన్న కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని.. వారు ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురుచూస్తాన్నారని ఈసందర్భంగా ఈటెల తెలిపారు. ఇదిలా ఉండగా ఉద్యోగుల విరమణ వయసు పెంచే యోచన లేదన్నారు. ఉద్యోగ విరమణకు ప్రస్తుతం కొనసాగుతున్న 58 సంవత్సరాల విధానాన్నే కొనసాగిస్తామన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపక అంశం ఇంకా తేలలేదన్నారు.

0 comments:
Post a Comment