కళకళలాడనున్న జాబ్ మార్కెట్.....
వ్యాపార సెంటిమెంట్లు, పరిస్థితులు మెరుగవుతుండటంతో కొన్ని నెలలుగా ఉద్యోగ నియామకాలూ పెరుగుతున్నాయి. తాజాగా పండుగ సీజన్ ఇందుకు మరింత ఊతం ఇవ్వనుంది. 5-15 శాతం మేర హైరింగ్ పెరగగలదని అంచనా వేస్తున్నట్లు ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ తెలిపింది. క్యాష్‌కరో డాట్‌కామ్ వెబ్‌సైట్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. డిస్కౌంటు ఆఫర్లు, షాపర్లు మళ్లీ మళ్లీ కొనుగోలు చేస్తుండటం వంటి కారణాలతో ఈ ఏడాది పండుగల సీజన్‌లో మిగతా కాలంతో పోలిస్తే లావాదేవీల సంఖ్య 300 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.
లావాదేవీలకు అనుగుణంగా కంపెనీలు సిబ్బందిని కూడా పెంచుకోవాల్సి ఉంటుందని టీమ్‌లీజ్ సర్వీసెస్ సూచించింది. మెట్రో, కాస్మోపాలిటన్ సిటీల్లోని ఆర్గనైజ్డ్ రిటైల్ రంగంలోనే కనీసం 25,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారత్‌లో ఏడాది పొడవునా ఏదో ఒక పండుగ ఉన్నా.. చివరి నెలల్లో దసరాతో మొదలు పెట్టి న్యూ ఇయర్ దాకా భారీగా షాపింగ్ జరుగుతుందని లేబర్‌నెట్ సర్వీసెస్ చెప్పింది. ఈ నెలల్లో వివిధ ఉత్పత్తులు, సేవల అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని..తదనుగుణంగా కంపెనీలకు అదనంగా మానవ వనరులూ అవసరమవుతాయని అంచనా.
ఈ-కామర్స్ కంపెనీలు డెలివరీ సేవల కోసం ఇప్పటికే పార్ట్ టైమ్ సిబ్బందిని తీసుకుంది. అలాగే, ఎఫ్ఎంసీజీ కంపెనీలు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్‌ను, రిటైల్ సంస్థలు సేల్స్ అసోసియేట్స్‌ను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుంటున్నట్లు స్పష్టమయింది. పండుగ సీజన్ లో కొలువుల జాతర ఉంటుందన్న వార్తలతో నిరుద్యోగులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.
0 comments:
Post a Comment