ఐటీలో భారీగా ఉపాధి అవకాశాలు * అయిదేళ్లలో తొలిదశ ఐటీఐఆర్ పూర్తి * నెలాఖరుకు వైఫై టెండర్లు * తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్

ఐటీలో భారీగా ఉపాధి అవకాశాలు
* అయిదేళ్లలో తొలిదశ ఐటీఐఆర్ పూర్తి
* నెలాఖరుకు వైఫై టెండర్లు
* తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ 
 హైదరాబాద్: తెలంగాణకు హైదరాబాద్ గుండె అయితే, ఐటీ పరిశ్రమ హైదరాబాద్‌కు గుండెలాంటిందని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఆ రంగంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వంద రోజుల పాల‌న పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా సెప్టెంబరు 9న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ రంగంలో హైదరాబాద్‌ను దేశంలోనే మొదటి స్థానానికి తీసుకెళ్తామన్నారు. ఐటీఐర్ తొలిదశను అయిదేళ్లలో పూర్తిచేసి, అయిదున్నర నుంచి ఆరు లక్షల మందికి ఉపాధి అవకాశాలను పెంచుతామన్నారు. ఇవికాక టీసీఎస్ 28 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించనుండగా అమెజాన్, హెచ్ఎస్‌బీసీ వంటి సంస్థలు హైదరాబాద్‌లో విస్తరణ కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. గూగుల్ సంస్థ అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ సంస్థకు గతంలో ఇచ్చిన భూమి వివాదాల్లో ఉండటంతో కొత్తగా పది ఎకరాల భూమిని కేటాయిస్తామన్నారు. మూడు లక్షల చదరపు గజాల స్థలం అందుబాటులోకి వచ్చేలా టి-హబ్‌ను తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తుందన్నారు. దేశంలోని ఇతర ఇంక్యూబేటర్లతో హైదరాబాద్ ఇంక్యూబేటర్‌ను అనుసంధానం చేస్తామన్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థల అనుసంధానం కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పనిచేస్తోందన్నారు. కంపెనీలు నేరుగా విద్యార్థుల సేవలను వినియోగించుకునేలా తీర్చిదిద్దుతామన్నారు. ఎక్ట్రానిక్ వస్తువుల తయారీ క్లస్టర్‌లో పరిశ్రమల ఏర్పాటుకు వివిధ సంస్థలు ముందుకొస్తున్నట్లు వివరించారు. ఎన్ఈసీ అనే జపాన్ సంస్థతో చర్చలు పూర్తయ్యాయని, శ్యాంసంగ్‌తో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఐటీఐఆర్‌లపై స్పష్టత కోసం సెప్టెంబరు 15న ఢిల్లీలో కేంద్ర ఐటీశాఖ మంత్రితో సమావేశం కానున్నట్లు మంత్రి చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని వైఫై నగరంగా మార్చే ప్రక్రియకు సంబంధించి... ఈ నెలాఖరుకు టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. టీ-హబ్‌కు సంబంధించి ఐఐఐటీ, ఐఎస్‌బీ, నల్సార్ విశ్వవిద్యాలయంతో కలసి రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం కొత్త మలుపు అని అన్నారు. ఐఐఐటీలో తాత్కాలికంగా ఏర్పాటయ్యే టి-హబ్‌లో 80 వేల చదరపు గజాల వసతి అందుబాటులోకి వస్తుందనీ, 700 నుంచి 800 స్టార్టప్ సంస్థలు వినియోగించుకోవచ్చన్నారు. 1,500 స్టార్టప్ సంస్థలకు ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం టి-హబ్ కోసం స్వయంగా మూడు లక్షల చదరపు గజాల భవనాన్ని నిర్మిస్తుందన్నారు. 
3,500 మంది విద్యార్థులకు శిక్షణ: మోహన్‌రెడ్డితెలంగాణలోని 19 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎంపిక చేసిన 3,500 మంది చివరి సంవత్సరం విద్యార్థుల నైపుణ్యాల పెంపునకు తమ సంస్థ రూ.కోటితో శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు సైంట్ ఎండీ బి.వి.ఆర్.మోహన్‌రెడ్డి తెలిపారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో తమ సంస్థ సామాజిక బాధ్యతగా రెండువేల కుటుంబాలకు శిక్షణ ఇస్తోందన్నారు. 
ఐఐఐటీ, ఐఎస్‌బీ, నల్సార్‌లతో ఒప్పందంస్టారప్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ల కోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో టి-హబ్ పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఇందుకు సంబంధించించి ఐఐఐటీ, ఐఎస్‌బీ, నల్సార్‌లతో సెప్టెంబరు 9న సర్కారు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్ సమక్షంలో... ఐటీ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, ఐఐఐటీ డైరెక్టర్ పి.జె.నారాయణ్, ఐఎస్‌బీ డైరెక్టర్ అజిత్ రంగ్నేకర్, నల్సార్ వీసీ ఫైజల్‌ముస్తాఫాలు ఒప్పందంపై సంతకాలు చేశారు.
Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment