డ్రైవర్, ప్లంబర్, పని మనిషి, సెక్యూరిటీ గార్డ్, ఇండస్ట్రియల్ లేబర్, మెకానిక్, కార్పెంటర్...ఇలాంటి చిన్నాచితకా ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్లెందరో. పెద్ద ఉద్యోగాల మాదిరి వీటికి పత్రికల్లో ప్రకటనలు ఉండవు. వీరు ఆన్‌లైన్ జాబ్ నెట్‌వర్కింగ్ సైట్లలో రిజిస్టర్ కాలేరు. అలాగే ఈ ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయో కూడా అభ్యర్థులకు పెద్దగా తెలీదు. కానీ ఇలాంటి ఉద్యోగాల కోసం లక్షల్లో ఖాళీలు ఉన్నాయి. దీనికి కారణం అభ్యర్థులకు, కంపెనీలకు మధ్య కనెక్టివిటీ లేకపోవడమే. ఈ లోటును భర్తీ చేయడానికి ఆవిర్భవించిందే టెక్ మహీంద్రా గ్రూపునకు చెందిన సరళ్ రోజ్‌గార్. కేవలం ఒక్క ఫోన్‌కాల్‌తో వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఉద్యోగాన్నీ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
 సాధారణంగా ప్లంబర్, కార్పెంటర్, మెకానిక్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డు, ఇండస్ట్రియల్ లేబర్...ఇలాంటి ఉద్యోగాలు ప్రతి కంపెనీలో ఉంటాయి. అలాగే ప్రతి వాణిజ్య సంస్థకు వీరితో అవసరం ఉంటుంది. నిజానికి వీళ్లే లేకపోతే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి. పేరుకి చిన్న ఉద్యోగాలైనా అవసరం విషయంలో వీళ్ల పాత్ర చాలా పెద్దదే. అయితే మిగిలిన పెద్ద ఉద్యోగాల్లా వీటిని ప్రకటన ద్వారా భర్తీ చేయడం లేదా నౌకరీ, మోన్‌స్టర్ లాంటి జాబ్ సైట్ల సాయంతో అభ్యర్థులను గుర్తించడం సాధ్యపడదు. ఎందుకంటే వీళ్లకు రెజ్యుమే రాయడం, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం తెలిసే అవకాశాలు తక్కువగా ఉండడమే కారణం. ఒకవేళ పత్రికలో ప్రకటన ఇచ్చినప్పటికీ అది వీళ్లదృష్టికెళ్లే అవకాశాలు కూడా తక్కువే. సరిగ్గా ఇవే అంశాలను పరిగణనలోకి తీసుకుని అటు అభ్యర్థులకు, ఇటు కంపెనీలకు ఇద్దరికీ సౌలభ్యంగా ఉండడానికి సరళ్ రోజ్‌గార్ సంస్థ ఏర్పాటైంది. ఈ విధానంలో ఉండే సౌలభ్యం ఏమిటంటే మొబైల్‌తో ఒక్క ఫోన్‌కాల్ ద్వారా అభ్యర్థులకు నచ్చిన భాషలో అక్కడున్న కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడవచ్చు. వివరాలన్నీ చెప్తే వాళ్లే రెజ్యుమే తయారు చేస్తారు. ఇక అప్పటి నుంచి అభ్యర్థి స్కిల్స్‌కి అనుగుణంగా ఎక్కడెక్కడ ఉద్యోగాలున్నాయో మొబైల్ ద్వారా సమాచారం అందుతుంది. అంతేకాదు ఏ ప్రాంతంలో ఉద్యోగం ఆశిస్తున్నారో తెలిపితే కోరినచోటే అవకాశం ఉంటే కొలువు దొరుకుతుంది. ఆశిస్తున్న వేతనాన్ని చెప్పి అంతకు తక్కువ కాకుండా జీతంగా పొందే అవకాశం ఉంది.

ఖాళీలెన్నో...
వందకు పైగా జాబ్ కేటగిరీలు, ఐదువేలకుపైగా సంస్థలు, 800కు పైగా ప్రాంతాల్లో లక్ష ఉద్యోగాలు, 15 లక్షల బ్లూ కాలర్ ఉద్యోగాలు ఉన్నాయంటోంది సరళ్ రోజ్‌గార్ సంస్థ. ప్రస్తుతం ఇందులో 20 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. మార్చి, 2014 నాటికి లక్ష మంది ఉద్యోగాలు పొందారు. గోద్రెస్, బోయేస్, మహీంద్రా ట్రాక్టర్స్, మహీంద్ర ఫస్ట్ ఛాయిస్, ఆల్‌స్టామ్ భారత్ ఫోర్జ్, గ్లాక్సోస్మిత్ క్లైమ్, గెయిన్ ఇండియా, సియస్టా హాస్పిటాలిటీ...ఇలా పలు సంస్థలు సరళ్ రోజ్గార్ ద్వారా ఖాళీలు భర్తీ చేసుకుంటున్నాయి. శ్రేయ్ సహజ్, సువిధ ఇన్ఫోసర్వ్, సీఎంఎస్ కంప్యూటర్స్ సంస్థలతో సరళ్ రోజ్‌గార్ భాగస్వామ్యాన్నీ కుదుర్చుకుంది. జాతీయ నైపుణ్య వృద్ధి సంస్థ (ఎన్ఎస్‌డీసీ), ఇగ్నో లాంటి సంస్థల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్రారంభస్థాయి ఉద్యోగాలు కల్పించడానికి కూడా సరళ్‌రోజ్‌గార్ ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రొఫైల్ తయారీ ఇలా..
దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. అవి ...1860 180 1100 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు చెప్పడం. కస్టమర్ కేర్ ప్రతినిధి అభ్యర్థి చెప్పిన వివరాల ప్రకారం రెజ్యుమేను రూపొందిస్తారు. లేదంటే వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ పేజీలోకి వెళ్లి రెజ్యుమే రూపొందించుకోవచ్చు. మొబైల్ నంబర్ యూజర్ ఐడీగా పనిచేస్తుంది. పాస్‌వర్డ్ ఎస్ఎంఎస్ రూపంలో మొబైల్‌కు అందుతుంది.
ప్రొఫైల్ అప్‌డేట్, ఎడిట్ చేసుకోవడమూ సులువే...
ప్రొఫైల్‌లో మార్పుచేర్పులు కూడా చేసుకోవచ్చు. ఫోన్‌కాల్ ద్వారా వివరాలు తెలిపి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ సహాయంతో ప్రొఫైల్‌ను మార్చుకోవచ్చు. ఆన్‌లైన్‌లో లాగిన్ అయి అభ్యర్థులు తమ సమాచారాన్ని నచ్చిన విధంగా అప్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది.
చాలా వరకు ఉచితమే...
ఈ సర్వీసులన్నీ ఉచితమే. అయితే చెల్లింపు యూజర్ కావడం ద్వారా మరిన్ని అవకాశాలు సొంతం చేసుకోవచ్చని సరళ్ రోజ్‌గార్ నిర్వాహకులు అంటున్నారు. ఉచిత వినయోగదారులు నెలకు ఏడు ఉద్యోగాలకోసమే దరఖాస్తు చేసుకునే వీలుంది. అదే చెల్లింపు ఉద్యోగార్థులైతే ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
పాస్‌వర్డ్ మార్పులు...
పాస్‌వర్డ్ కావాలనుకుంటే లాగిన్ అయి మార్చుకోవచ్చు. అలాగే పాస్‌వర్డ్ మర్చిపోతే మెయిల్, మొబైళ్లకు దాన్ని చేరవేస్తారు. అకౌంటు 90 రోజుల వరకు యాక్టివ్‌గా ఉంటుంది. ఈలోగా ఎప్పుడూ లాగిన్ కాకపోయినట్లయితే ఆ అకౌంట్ ముగుస్తుంది. మళ్లీ కొత్తగా వివరాలు నమోదుచేసుకోవాలి.
జాబ్ అలర్ట్
ఎస్ఎంఎస్, మెయిల్, మొబైల్‌కి వాయిస్ కాల్...ఇలా మీరు కోరుకున్న విధానంలో జాబ్ అలర్ట్ సమాచారం అందుతుంది. అన్ని రకాల అలర్ట్‌లూ కావాలనుకుంటే కొంత మొత్తం చెల్లించాలి. అలర్ట్ సమాచారంతో సంబంధిత ఉద్యోగానికి అభ్యర్థి ఫోన్‌కాల్ లేదా ఇంటర్నెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన ఇచ్చిన కంపెనీ ప్రతినిధులు ఫోన్‌లో మాట్లాడడం, నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించడం...ఇలా ఏదో ఒక విధానంలో అభ్యర్థులతో సంప్రదింపులు జరిపి అవసరమైన వాళ్లను ఉద్యోగులుగా తీసుకుంటాయి.
సంస్థల కోసమూ సర్వీస్...
ఏవైనా సంస్థలు ఉద్యోగులు కావాలనుకుంటే సరళ్ రోజ్‌గార్‌లో వివరాలు నమోదుచేసుకోవచ్చు. కొంత మొత్తం చెల్లించి నేరుగా అభ్యర్థులకు ఎస్ఎంఎస్‌లు పంపి ఎంపికచేసుకోవచ్చు.
వెబ్‌సైట్: www.saralrozgar.com

0 comments:
Post a Comment