***తెలంగాణలో 28 వేల టీసీఎస్ ఉద్యోగాల జాతర***
విద్య, విద్యుత్, ఉద్యోగం, వ్యాపారం తదితర రంగాల్లో రాష్ర్టాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో దేశ ఐటీ రంగంలోని అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తెలంగాణలో కొత్తగా భారీ స్థాయిలో రిక్రూట్మెంట్కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీసీఎస్ సంస్థలో 26 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, త్వరలోనే మరో 28 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కంపెనీ సీఈవో చంద్రశేఖరన్ తెలిపారు.
గురువారం ఆయన కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రాజన్నతో కలిసి సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. హైదరాబాద్లో కంపెనీ కార్యకలాపాల గురించి ఈ సందర్భంగా చంద్రశేఖరన్ సీఎంకు వివరించారు. వారి మధ్య జరిగిన చర్చలో… సాఫ్ట్వేర్ రంగం వేగంగా విస్తరిస్తున్న ఆదిభట్ల ప్రాంతంలో పూర్తి స్థాయి పోలీసు స్టేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వెంటనే అంగీకరించడంతోపాటు, ఈ దిశగా పని ప్రారంభించాలని డీజీపీ అనురాగ్శర్మను ఆదేశించారు.
టీసీఎస్కు ప్రపంచవ్యాప్తంగా శాఖలు ఉన్నాయని, కంపెనీకి ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద కేంద్రం హైదరాబాద్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… రాష్ట్ర పునర్నిర్మాణంలో టీసీఎస్ సేవలను ఉపయోగించుకుంటామని చెప్పారు.
రాష్ట్రంలో వ్యాపార, పారిశ్రామిక స్నేహశీల ప్రభుత్వం ఉన్నందున నూతన పెట్టుబడి ప్రతిపాదనలతో ముందుకు రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. టీసీఎస్ భవిష్యత్లో చేసే అన్ని రకాల విస్తరణ కార్యక్రమాలకు ప్రభుత్వపరంగా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు.
***Keep in touch wit us
*****************************Get updates direct Via Ur mail in box ********************


0 comments:
Post a Comment