| 17 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్! | |
* 26న సీట్ల కేటాయింపు * 27 నుంచి తరగతులుఐసెట్ - 2014 (ఎంబీఏ, ఎంసీఏ) ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీలు సెప్టెంబరు 13న వెలువడ్డాయి. సెప్టెంబరు 17 నుంచి 21 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 36 సహాయ కేంద్రాల్లో విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఆప్షన్ల నమోదు సెప్టెంబరు 20 నుంచి 23 వరకు జరుగుతుంది. సెప్టెంబరు 24న చివరిసారిగా ఆప్షన్ల నమోదులో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. సెప్టెంబరు 26న సీట్ల కేటాయింపు జరుగుతుంది. సెప్టెంబరు 27 నుంచి ఫీజు చెల్లింపులు, కళాశాలల్లో తరగతులు ప్రారంభం అవుతాయని ప్రవేశాల క్యాంప్ అధికారులు డాక్టర్ రఘునాథ్, శ్రీనివాస్ సెప్టెంబరు 13న వెల్లడించారు. * పీహెచ్, క్యాప్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్‌లకు మాత్రం హైదరాబాద్, మాసబ్‌ట్యాంక్‌లో ఉన్న సాంకేతిక విద్యాభవన్‌లో 17 నుంచి 20 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. | |
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment