ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి
ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ శనివారంతో ముగిసింది. రెండు రాష్ర్టాల్లో కలిపి మొత్తం 1,21,709 మంది విద్యార్థులు సహాయ కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. వెబ్ ఆప్షన్ల ఎంపికకు అవసరమైన ఎంసెట్ వన్‌టైం పాస్‌వర్డ్‌ను కౌన్సెలింగ్ అధికారుల నుంచి పొందారు. తెలంగాణ రాష్ట్రంలో 56,042 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 65,667 మంది విద్యార్థులు సర్టిఫికెట్లను తనిఖీ చేయించుకున్నారని ఎంసెట్-2014 అడ్మిషన్ల కన్వీనర్ తెలిపారు. రెండు రాష్ర్టాల్లో వెబ్ ఆప్షన్ల ఎంపిక కొనసాగుతున్నదని, మొత్తం 87,859 మంది వెబ్ ఆప్షన్లను ఇచ్చారని తెలిపారు. తాజా లెక్కల ప్రకారం రెండు రాష్ర్టాల్లో కలిపి 2,02,396 సీట్లు అందుబాటులో ఉండగా.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత 1,28,985 సీట్లు మిగిలిపోయే అవకాశముంది. జేఎన్టీయూ ద్వారా గుర్తింపు పొందిన 141 ఇంజినీరింగ్ కాలేజీల్లో దాదాపు 81,687 సీట్లు మిగిలిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సీట్లు, కాలేజీల వివరాలు ఇలా ఉన్నాయి..
వివరాలు తెలంగాణ & సీమాంధ్రలో మొత్తం
అర్హులైన అభ్యర్థులు 1,12,233 87,963 2,02,396
కాలేజీల సంఖ్య 317 148 465
సీట్ల సంఖ్య 1,64,673 85,021 2,49,694
కన్వీనర్ సీట్లు 1,15,271 59,515 1,74,786
సర్టిఫికేషన్ వెరిఫికేషన్ 59,665 39,767 99,432


0 comments:
Post a Comment