గ్రూప్ - 1, గూప్ - 2, గ్రూప్ - 4 ప్రిపరేషన్ ప్లాన్

ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని.. దానికి అనుగుణంగా జీవితాన్ని మలచుకొని నిజాయితీగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు.. ఇప్పుడిప్పుడే డిగ్రీ పూర్తి చేసుకొని బయటకు వచ్చే వారికి, ఇప్పటికే ఒకట్రెండు సార్లు ప్రయత్నించి విఫలమైన వారికి ఆశాదీపాలుగా ఏపీపీఎస్సీ నుంచి వివిధ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 తదితర పరీక్షల్లో జనరల్ స్టడీస్ కీలకమైన పేపర్. ఈ నేపథ్యంలో జీఎస్ సిలబస్‌లోని సబ్జెక్టులేంటి? ప్రిపరేషన్‌ను ఎలా కొనసాగించాలి? తదితర అంశాలపై నిపుణుల విశ్లేషణ.. 

పాలిటీ

ఏపీపీఎస్సీ(TSPSC syllabus may Chang slight    ) పరీక్షల్లో భారత రాజకీయ వ్యవస్థ కు సంబంధించి సమకాలీన అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల ఇటీవల అమల్లోకి వచ్చిన ‘నిర్భయ చట్టం’, ఆహార భద్రతపై ఆర్డినెన్‌‌స తదితరాలకు సంబంధించిన ముఖ్యాంశాలను తెలుసుకోవాలి. 
ముఖ్యమైన వ్యవస్థల అధిపతులెవరు? ఉదా: ప్రస్తుత ఇ-అఎ; ప్రధాన ఎన్నికల అధికారి; సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి; వివిధ స్థాయీ సంఘాల (పార్లమెంటు/ఆంధ్రప్రదేశ్ శాసనసభ) అధ్యక్షుల పేర్లు; యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ అధ్యక్షుల పేర్లు తెలుసుకుంటే మంచిది.
పొరుగు దేశాల్లో ఇటీవల సంభవించిన రాజకీయ పరిణామాలపై అభ్యర్థులు దృష్టిసారించాలి. చైనా అధ్యక్షుడు, ప్రధానమంత్రి; పాకిస్థాన్‌లో ఎన్నికలు; శ్రీలంకలో 13వ రాజ్యాంగ సవరణ చట్టం (వికేంద్రీకరణకు సంబంధించి); మాల్దీవులు, నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తదితరాల గురించి తెలుసుకోవాలి.
రాజ్యాంగ పరిషత్ ఎన్నికల విధానం; ముఖ్య కమిటీల అధ్యక్షులు; పరిషత్ చివరి సమావేశం లక్ష్యాల తీర్మానం (పీఠికకు మూలం); ముఖ్య షెడ్యూళ్లు, కీలకమైన సుప్రీంకోర్టు తీర్పులు; రాష్ట్రపతి ఎన్నిక; రాజ్యసభ/విధాన పరిషత్‌లకు ఎన్నిక విధానం; కేంద్ర-రాష్ట్ర సంబంధాలు; జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల ఏర్పాటు, కాశ్మీర్ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తి; ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు సంబంధించిన జాతీయ కమిషన్ల తాజా సమాచారాన్ని చదవాలి.
రిఫరెన్స్:
1.బి.ఎ. రాజనీతి శాస్త్రం సెకండియర్.

2.బి.ఎ. ప్రభుత్వ పాలన సెకండియర్.

3.వార్తా పత్రికలు, మేగజీన్లు.

గత ప్రశ్నలు:
గ్రూప్-1, 2012.
1.దేశంలో సాధారణ, విత్త పరిపాలనను సమర్థవంతంగా నియంత్రించుటకు పార్లమెంటు నియమించిన ముఖ్యమైన శాశ్వత కమిటీలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, డిపార్ట్‌మెంటల్ కమిటీలు మరియు

1.విదేశీ వ్యవహారాల కమిటీ

2.పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ

3.రాష్ట్ర ప్రభుత్వ విత్తములపై కమిటీ

4.ప్రభుత్వ రంగ సంస్థలపై కమిటీ

సమాధానం: (4)
2.భారత పార్లమెంటు వ్యవస్థలో రాజ్యసభ సభ్యులను ఎన్నుకొనే పద్ధతి?

1.బదిలీకి వీల్లేని ఓటు పద్ధతి

2.ఏక ఓటు బదిలీ పద్ధతి

3.సంచిత ఓటు పద్ధతి

4.భారిత సగటు ఓటు పద్ధతి

సమాధానం: (2)

- డా॥బి.జె.బి. కృపాదానం

ఎకానమీ

ఏపీపీఎస్సీ పరీక్షలకు సంబంధించిన జనరల్‌ స్టడీస్ గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నట్లు గమనించవచ్చు. ఎకానమీకి సంబంధించి పంచవర్ష ప్రణాళికలు, బ్యాంకింగ్, భూ సంస్కరణలు, పన్నుల వ్యవస్థ, పారిశ్రామిక తీర్మానాలు, బడ్జెట్, విదేశీ వాణిజ్యం, జాతీయాదాయం, జనాభా, ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, సెబీ, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, మానవాభివృద్ధి అంశాలను పరిశీలించాలి.
ప్రణాళికలను అధ్యయనం చేసే క్రమంలో వివిధ ప్రణాళికల లక్ష్యాలు, ప్రణాళికల్లో రంగా ల మధ్య వనరుల కేటాయింపు, 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలను అధ్యయనం చేయాలి.
స్వయం ఉపాధి, వేతన ఉపాధి పథకాలను విడి గా గుర్తించేలా చదవాలి. 2011 జనాభా లెక్కల ను అంశాల వారీగా అధ్యయనం చేయాలి. ఆర్థిక సమస్యలైన పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నుంచి 1-3 ప్రశ్నలు వచ్చే అవకాశముంది. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వివిధ పదాలపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవాలి. పన్నుల వ్యవస్థ- కోశ విధానం ముఖ్యాంశంగా ఉండి 1 నుంచి 2 ప్రశ్నలు వచ్చే అవకాశముంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విధించే పన్నులు.. రాజా చెల్లయ్య, కేల్కర్ కమిటీల సిఫార్సులను అధ్యయనం చేయాలి. బడ్జెట్‌లోని వివిధ కాన్సెప్టులపై అవగాహన అవసరం.
కరెంటు అఫైర్స్‌లో భాగంగా రూపాయి విలువ క్షీణత, కరెంట్ అకౌంట్‌లోటు, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ సంక్షోభ ప్రభావాలపై అవగాహన అవసరం.
విదేశీ వాణిజ్యంలో భాగంగా ప్రధాన ఎగుమతులు, దిగుమతులు; మూలధన అకౌంట్‌లో రూపాయి మార్పిడికి సంబంధించిన అంశాలపై నోట్స్ రూపొందించుకోవాలి. 2012 యూఎన్‌డీపీ మానవాభివృద్ధి నివేదికలోని వివిధ సూచీలు, వాటికి సంబంధించి భారత్ పరిస్థితిని విశ్లేషించాలి.
భారత ఆర్థిక వ్యవస్థలో చదువుకున్న విషయాలను ఆంధ్రప్రదేశ్‌కు అన్వయించి చదవాలి. రాష్ర్ట ఆర్థిక సర్వే, ఆంధ్రప్రదేశ్ మేగజీన్‌ను పరిశీలించడం ద్వారా ఏపీ ఎకానమీకి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు.
రిఫరెన్స్: 
Indian Economy MISHRA & PURI,
ఆర్థిక సర్వే 2012-13; మానవాభివృద్ధి నివేదిక; ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్; ఇండియన్ ఎకానమీ సిన్స్ ఇండిపెండెన్స్- ఉమా కపిల. 

గత ప్రశ్నలు: గ్రూప్-1, 2012. 
1.ఆరో పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో భారత ప్రభుత్వం చేర్చిన విశిష్ట భావన?

1.దీర్ఘకాలపు ప్రణాళిక

2.కనీస అవసరాల పథకం

3.నిరంతర ప్రణాళిక (రోలింగ్ ప్లాన్)

4.గ్రామీణాభివృద్ధి పథకం

సమాధానం: (3)
2.కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కల వివరాల ప్రకారం సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్ పొందిన స్థానం?

1.4వ స్థానం

2.5వ స్థానం

3.6వ స్థానం

4.8వ స్థానం

సమాధానం: (2)

- డా॥తమ్మా కోటిరెడ్డి

చరిత్ర



ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇతర సబ్జెక్టులకు పోటీగా హిస్టరీకి సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. ఈ సబ్జెక్టును జనరల్ స్టడీస్ సిలబస్‌లో స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రత్యేక దృష్టితో చదవాలని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర.. మూడింటికీ దాదాపు సమాన ప్రాధాన్యం ఇస్తూ ప్రశ్నలు అడుగుతున్నారు. మిగిలిన వాటితో పోలిస్తే ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి రెండు, మూడు ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి. దీనికి అనుగుణంగా అభ్యర్థులు ప్రిపరేషన్ కొనసాగించాలి. 
జనరల్ స్టడీస్‌లోని మిగిలిన సబ్జెక్టులతో పోలిస్తే హిస్టరీ పరిధి ఎక్కువనే చెప్పాలి. అయినా చదవడానికి ఆసక్తికరంగా, తేలిగ్గా ఉండటం దీని అనుకూల అంశాలు. ఇటీవల కాలంలో జరిగిన వివిధ పరీక్షల్లోని ప్రశ్నల సరళిని అధ్యయనం చేయడంద్వారా ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో గుర్తించొచ్చు. కీలక అంశాలకు అధిక సమయం వెచ్చించి, వాటిని రివిజన్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చరిత్ర నుంచి అడిగే ప్రశ్నలు సాధారణంగా రెండు రకాలుంటాయి. 

1.డెరైక్ట్‌గా అడిగే ప్రశ్నలు. వీటిని ఏక పద సమాధాన ప్రశ్నలని అంటారు.
ఉదా: నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడు ఎవరు? 
సమాధానం: కుమార గుప్తుడు
ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే విషయ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. 
2.ఇన్‌డెరైక్ట్‌గా అడిగే ప్రశ్నలు. వీటిని కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలని అంటారు.

ఉదా: జూన్ 3, 1947 నాటి మౌంట్‌బాటన్ ప్రణాళికలో లేని అంశం? 
సమాధానం: దేశంలో జరుగుతున్న మత ఘర్షణలను నిరోధించడం
ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉండాలి. బిట్ల రూపంలో ఉండే మెటీరియల్‌ను కాకుండా విషయంపై పూర్తి అవగాహన కలిగించే ప్రామాణిక పాఠ్యపుస్తకాలు చదవాలి. ఓ అంశాన్ని చదివేటప్పుడు దాన్నుంచి ఏయే కోణాల్లో ప్రశ్నలు వచ్చే అవకాశముందో అంచనా వేయాలి. అప్పుడే చరిత్రలో మంచి మార్కులు సాధించొచ్చు. ఏపీ హిస్టరీకి సంబంధించి శాతవాహనులు, శాతవాహన సామ్రాజ్యానంతర రాజవంశాలు, విజయనగర సామ్రాజ్యం, కుతుబ్‌షాహీల యు గం, ఐరోపావాసుల రాక, అసఫ్‌జాహీల కాలం, ఆంధ్రలో సాంస్కృతిక పునరుజ్జీవనం, స్వాతంత్య్ర ఉద్యమం, ఆంధ్ర రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అవతరణ తదితర విషయాలను చదవాలి. ఇవి చదివితే గ్రూప్-2 పేపర్-2కు కూడా ఉపయోగపడతాయి. రిఫరెన్స్: ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతి పుస్తకాలు; బీఏ తెలుగు అకాడమీ బుక్స్; ఎంఏ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు; పి.రఘునాథరావు-ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర; బీఎస్‌ఎల్ హనుమంతరావు-ఆంధ్రుల చరిత్ర.

గత ప్రశ్నలు: (గ్రూప్-1, 2012). 
1.ఏ ఉద్యమ కాలం నుంచి తిలక్ ‘లోకమాన్య’గా ప్రసిద్ధి పొందెను?

1.వందేమాతరం ఉద్యమం

2.ఖిలాఫత్ ఉద్యమం

3.హోమ్‌రూల్ ఉద్యమం

4.సహాయ నిరాకరణ ఉద్యమం

సమాధానం: (3) 
2.అల్లూరి సీతారామరాజు సమాధి ఇక్కడ కలదు..

1.మోగల్లు

2.చింతపల్లి

3.శంఖవరం

4.కృష్ణదేవిపేట

సమాధానం: (4) 

- కె. యాకుబ్ బాషా

జాగ్రఫీ



ఏపీపీఎస్సీ పరీక్షల్లో జాగ్రఫీకి సంబంధించి సమకాలీన అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సబ్జెక్టులోని వివిధ అంశాలను, సమకాలీన అంశాలతో సమన్వయపరుస్తూ చదివితే మంచి ఫలితం ఉంటుంది. 
గత ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రశ్నల స్వభావాన్ని, ఏయే అంశాలు ఎక్కువగా పునరావృతమవుతున్నాయో గమనించి దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించాలి.
జాగ్రఫీని ప్రధానంగా మూడు విభాగాలుగా విభజించి చదవాలి.
అవి:
1.వరల్డ్ జాగ్రఫీ.

2.ఇండియన్ జాగ్రఫీ.

3.ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ.

వరల్డ్ జాగ్రఫీ: 

విశ్వం, సౌర కుటుంబం, గ్రహాలు, ఉపగ్రహాల గురించి తెలుసుకోవాలి. భూమికి సంబంధించి భూభ్రమణం, భూపరిభ్రమణం.. వాటి ప్రభావాలను గురించి చదవాలి. భూమి అంతర్నిర్మాణం-పొరలు గురించి తెలుసుకోవాలి.
భూ చలనాలు-వివిధ సిద్ధాంతాలు; శిలలు-మృత్తికలు; క్రమక్షయం గురించి చదవాలి.
పీఠభూములు, మైదానాలు వంటి ప్రధాన భూ స్వరూపాలు; అంతర్జాతీయ దినరేఖ, స్థానిక కాలం తదితరాల గురించి తెలుసుకోవాలి.
ప్రధాన పంటలు-పండించే దేశాలు; వ్యవసాయ రీతులు, వ్యవసాయ ఉత్పత్తులు; అటవీ విస్తరణ, అటవీ సమస్యలు, అంతరించిపోతున్న జీవజాతులు, రెడ్ డేటా బుక్‌ల గురించి తెలుసుకోవాలి.
ఆవరణ శాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక భావనలు-ఆహార గొలుసు, జీవ వైవిధ్యం తదితర అంశాలపై దృష్టిపెట్టాలి.
శీతోష్ణస్థితిలో మార్పులు-ప్రభావాలు; పర్యావరణ సదస్సులను ప్రత్యేకంగా చదవాలి.
ఇండియన్ జాగ్రఫీ:
మన దేశానికి సంబంధించి వార్తల్లో ఉన్న భౌగోళిక ప్రాంతాల ఉనికి, సహజ ఉద్భిజ సంపదపై దృష్టిసారించాలి.
దేశ అంతర్గత, అంతర్జాతీయ సరిహద్దులపై ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల ఈ విషయాలపై మ్యాప్‌ల ఆధారంగా పట్టుసాధించాలి.
నీటిపారుదల, పంటల విస్తరణ; వార్తల్లో ఉన్న నదులు-ఉపనదులు-వాటిపై ఉన్న ఆనకట్టల గురించి తెలుసుకోవాలి.
ఇండియన్ జాగ్రఫీలో ప్రధాన అంశం రుతుపవనాలు. వర్షపాత విస్తరణ, వర్షాల ముందస్తు అంచనా తదితర అంశాలను తెలుసుకోవాలి.
ఖనిజ వనరుల విస్తరణ, పరిశ్రమలు, సంప్రదాయేతర ఇంధన వనరులు.
ఇటీవల కాలంలో ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షల్లో రేవు పట్టణాలు-జల మార్గాలపై ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల వాటిపై దృష్టిపెట్టాలి.
ఆదిమ తెగలను భౌగోళిక ప్రాంతాలవారీగా చదవాలి.
ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ:
ఇండియన్ జాగ్రఫీలో ప్రస్తావించిన అంశాలను ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దృష్టితో చదవాలి.
రిఫరెన్స్: ఎన్‌సీఈఆర్‌టీ, 10, 11, 12వ తరగ తుల జాగ్రఫీ పాఠ్య పుస్తకాలు; భారత సామాజిక ఆర్థిక సర్వే.
ఎకనమిక్ సర్వేలో వ్యవసాయం, రవాణా, ఇంధన వనరులకు సంబంధించిన అంశాలను ప్రధానంగా చదవాలి.
విపత్తు నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్):
విపత్తులు- వాటి నిర్వహణ, విపత్తుల రకాలు, ప్రభావాలు, కారణాల గురించి చదవాలి.
భూకంపాలు, వరదలు, కరువులు, సునామీలను భారతదేశం కోణంలో అధ్యయనం చేయాలి.
దేశంలో విపత్తు నిర్వహణ-పరిణామాల గురించి తెలుసుకోవాలి. పారిశ్రామిక, రసాయన విపత్తులపైనా దృష్టిసారించాలి.
గత ప్రశ్నలు: గ్రూప్-1, 2012.
1.భారతదేశంలో దుమ్ము తుపానులు (డస్ట్ స్టార్మ్స్) ఏ నెలలో ఎక్కువగా వస్తాయి?

1.మార్చి

2.మే

3.జూలై

4.అక్టోబర్

సమాధానం: (2)
2.పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ను కలిపేది (రహదారి)

1.బోలాన్ పాస్

2.ఖైబర్ పాస్

3.రోహటాంగ్ పాస్

4.ఆఫ్‌గన్ పాస్

సమాధానం: (2)

- గురజాల శ్రీనివాసరావు

జనరల్ సైన్స్/ఎస్ అండ్ టీ



ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2, ఇతర అన్ని పరీక్షల్లో జనరల్‌స్టడీస్ పేపర్‌కు సంబంధించి జనరల్ సైన్స్, టెక్నాలజీ అంశాలకు ఒకే విధంగా అభ్యర్థులు ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. జనరల్ సైన్స్‌లో భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం తదితర విభాగాలుంటాయి. వీటికి అదనంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ కాలుష్యం, జీవ వైవిధ్యం వంటి అంశాలపై కూడా దృష్టిసారించాలి.
తొలుత అభ్యర్థులు చేయాల్సింది జనరల్ సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం అంశాలకు సంబంధించిన పరిధిని అర్థం చేసుకోవాలి. దీనికోసం గత మూడేళ్లలో ఏపీపీఎస్సీ నిర్వహించిన జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రాలను క్షుణ్నంగా పరిశీలించాలి.
6-10 తరగతుల పాఠ్యపుస్తకాలను చదవడం ద్వారా సైన్స్ పదాలపై అవగాహన పెరుగుతుంది. ఇలాంటి అవగాహన వల్ల సమకాలీన అంశాలను తేలిగ్గా అర్థం చేసుకొని చదవడానికి వీలవుతుంది. పరమాణు నిర్మాణం, ఎలక్ట్రాన్ విన్యాసం వంటి ప్రాథమిక అంశాలపై అవగాహన ఏర్పడితేనే కాంపోజిట్స్, పాలిమర్స్, అణుశక్తి తదితర అంశాలు బాగా అర్థమవుతాయి. ఇలాంటి అవగాహన గ్రూప్-1 అభ్యర్థులకు మరీ ముఖ్యం. ఇది ప్రిలిమినరీ పరీక్ష ప్రిపరేషన్ సమయంలోనే మెయిన్స్‌కు సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్‌పై పట్టు సాధించడానికి ఉపయోగపడుతుంది.
టెక్నాలజీ రంగంలో అంతరిక్ష రంగం- ఇటీవలి ప్రయోగాల వివరాలు; రక్షణ రంగం- ప్రధానంగా క్షిపణుల సమాచారం; అణుశక్తి- విచ్ఛిత్తి, సంలీనం, రేడియోధార్మిక ఐసోటోపుల ఉపయోగాలు, రియాక్టర్ల రకాలు; ఐటీ- సోషల్ నెట్‌వర్కింగ్, ఈ-గవర్నెన్స్; బయోటెక్నాలజీ- మూలకణాలు, జన్యుమార్పిడి మొక్కలు, టీకాలు తదితర అంశాలను చదవాలి.
భౌతికశాస్త్రంలో మెకానిక్స్, ప్రమాణాలు, విద్యుత్, ధ్వని, ఉష్ణశక్తి మొదలైనవి.
రసాయనశాస్త్రంలో అనువర్తిత అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
జీవశాస్త్రంలో ప్రధానంగా మానవ శరీరధర్మ శాస్త్రం, వ్యాధులు; పోషణ; ముఖ్యమైన జంతువులు, మొక్కల శాస్త్రీయ నామాలు; ఉపయోగకర జంతువులు, మొక్కలు.
రిఫరెన్స్:ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు, పత్రికలు, మేగజీన్లు.
గత ప్రశ్నలు: గ్రూప్-1, 2012.
1.గ్లాస్ ఊలు అనగా?

1.గాజు, ఉన్నిల మిశ్రమం

2.పారదర్శకత కలిగిన ఉన్ని

3.అతి సన్నగా పొడిచేసిన గాజు

4.అతి సన్నటి గాజు తంతువులు

సమాధానం: (4) 
2.కఠిన జలంలో ఉండే అయాన్లు..

1.కాల్షియం, మెగ్నీషియం

2.సోడియం, పొటాషియం

3.కాల్షియం, బేరియం

4.నెట్రోజన్ పెంటాక్సైడ్

సమాధానం: (1) 

- సి.హరికృష్ణ

మెంటల్ ఎబిలిటీ

ఏపీపీఎస్సీ నుంచి వస్తున్న గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4, జేఎల్ తదితర నోటిఫికేషన్లకు సంబం ధించిన పరీక్షల్లో మిగిలిన సబ్జెక్టులతో పోలిస్తే మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు నిమిషం కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. అయితే చిట్కాల ద్వారా ప్రతిరోజూ సాధన చేస్తే త్వరగా సమాధానాలు గుర్తించవచ్చు. 
జనరల్ స్టడీస్ పేపర్‌లో 150 ప్రశ్నలకుగాను మెంటల్ ఎబిలిటీ నుంచి 20 నుంచి 25 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ఈ ప్రశ్నలను మూడు విభాగాలుగా చెప్పుకోవచ్చు. అవి: అర్థమెటిక్, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్. పదో తరగతి లోపు గణితశాస్త్రంలో ఉన్న అంశాలే అర్థమెటిక్‌లో ఉంటాయి. కాలం-దూరం, కాలం-పని, సరాసరి, నిష్పత్తి-అనుపాతం, శాతాలు, లాభం-నష్టం, భాగస్వా మ్యం, కసాగు-గసాభా, క్షేత్రమితి-2డీ అండ్ 3డీ తదితర అంశాలపై అభ్యర్థులు దృష్టిసారించాలి. ఏపీపీఎస్సీ పరీక్షల్లో అర్థమెటిక్‌కు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీన్నుంచి 2 లేదా 3 ప్రశ్నలు మాత్రమే వస్తున్నాయి.
అకాడమీ పుస్తకాల్లో లేని అంశం రీజనింగ్. ఇది కేవలం పోటీ పరీక్షల్లో మాత్రమే కనిపిస్తుంది. అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని అంచనా వేసేందుకు రీజనింగ్‌పై ప్రశ్నలు ఇస్తున్నారు. రీజనింగ్‌ను వెర్బల్, నాన్ వెర్బల్ విభాగాలుగా విభజించవచ్చు. నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే పదాలు లేకుండా కేవలం చిత్రాల ద్వారా అడిగే ప్రశ్నలు. ఉదాహరణకు నాలుగు చిత్రాలు ఇచ్చి, ఆ తర్వా త ఏ చిత్రం వస్తుందనిగానీ, ఇచ్చిన చిత్రాల్లో ఏది భిన్నంగా ఉందనిగానీ అడుగుతారు.
ఇచ్చిన చిత్రంలో అంతర్లీనంగా ఎన్ని త్రిభుజాలున్నాయి? ఎన్ని చతురస్రాలున్నాయి? ఎన్ని దీర్ఘచతురస్రాలున్నాయి? ఎన్ని సరళరేఖలున్నాయి? వంటి ప్రశ్నలు అడగొచ్చు.
వెర్బల్ రీజనింగ్ ముఖ్యమైన విభాగం. మెంటల్ ఎబిలిటీ విభాగంలో ఇచ్చిన ప్రశ్నల్లో రెండు, మూడు మినహా, మిగిలినవన్నీ వెర్బల్ రీజనింగ్ నుంచే వస్తున్నాయి. అందువల్ల అభ్యర్థులు ఈ విభాగంపై దృష్టిపెట్టాలి.
వెర్బల్ రీజనింగ్‌లో సిరీస్; అనాలజీ (పోలిక పరీక్ష); క్లాసిఫికేషన్ (భిన్న పరీక్ష); కోడింగ్ అండ్ డీకోడింగ్; దిక్కులు; రక్త సంబంధాలు; సీటింగ్ అరేంజ్‌మెంట్స్; ఆల్ఫాబెట్ టెస్ట్; సిల్లాయిజమ్ తదితర అంశాలుంటాయి. వీటిని సులువుగా చేయడానికి ఏకైక మార్గం వీలైనన్ని ఎక్కువ ప్రశ్నల్ని సాధన చేయడమే. దీనికోసం పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి.
మెంటల్ ఎబిలిటీ విభాగంలో ఉన్న ప్రశ్నలను మరో కోణంలో మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: 1. సంఖ్యల ఆధారిత ప్రశ్నలు. 2. అక్షరాల ఆధారిత ప్రశ్నలు. 3. ఇతర ప్రశ్నలు.
సంఖ్యల ఆధారిత ప్రశ్నలను పరిశీలిస్తే అర్థమెటిక్‌లోని అన్ని అంశాలు, రీజనింగ్‌లోని నంబర్ సిరీస్, నంబర్ అనాలజి, నంబర్ క్లాసిఫికేషన్ వంటి అంశాలు ఇందులోకి వస్తాయి. వీటిని వేగంగా చేయాలంటే అభ్యర్థి ముందుగా కింది అంశాలపై పట్టుసాధించాలి.
అవి సంఖ్యావాదం, వివిధ రకాల సంఖ్యలు, కనీసం 11 వరకు భాజనీయత సూత్రాలు, 20 వరకు ఎక్కాలు, 35 వరకు వర్గాలు, 15 వరకు ఘనాలు నేర్చుకోవాలి. కూడిక, తీసివేత, భాగహారాలు వేగంగా చేయగలగాలి.
వేద గణిత అభ్యసనం వల్ల వేగంగా రఫ్ వర్క్ చేయకుండా డెరైక్ట్‌గా సమాధానం రాయవచ్చు. అర్థమెటిక్‌లోని దాదాపు అన్ని ప్రశ్నలు సూత్రాల ఆధారంగా ఉంటాయి. కాబట్టి వీటిని నేర్చుకోవాలి.
అక్షరాల ఆధారిత ప్రశ్నల్లో లెటర్ సిరీస్, లెటర్ అనాలజి, లెటర్ క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఆల్ఫాబెట్ టెస్ట్ ఉంటాయి.
టిప్స్: 
A నుంచి Z వరకు, Z నుంచి అ వరకు వేగంగా చదవగలగాలి.
A నుంచి Z వరకు వాటి స్థాన విలువలు తెలిసుండాలి. (అ స్థానవిలువ A-1, B-2, C-3, ......, Z-26)
A నుంచి Z వరకు తిరోగమన స్థాన విలువలను నేర్చుకోవాలి. (A-26, B-25,....., Z-1)
A నుంచి Z వరకు వాటి తిరోగమన స్థానాక్షరాలు తెలిసుండాలి. (A-Z, B-Y, C-X,...., Z-A)
ఇంగ్లిష్‌లో అచ్చులు అ,ఉ,ఐ,ఖల గురించి అందరికీ తెలిసిందే. ఈ అంశాలను నేర్చుకుంటే అక్షరాల ఆధారంగా వచ్చే ప్రశ్నలను త్వరగా చేయొచ్చు.
చివరగా మూడో విభాగం ప్రశ్నలు అంటే సంఖ్యలకుగానీ, అక్షరాలకుగానీ సంబంధం లేని ప్రశ్నలు. ఉదాహరణకు నాన్ వెర్బల్ రీజనింగ్ ప్రశ్నలు, రక్తసంబంధాలు, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, తార్కిక వెన్‌చిత్రాలు. నిశిత పరిశీలనా శక్తి ఉంటే చాలు.. ఈ ప్రశ్నలకు వేగంగా సమాధానాలను గుర్తించొచ్చు.
రిఫరెన్స్: ఆర్‌ఎస్ అగర్వాల్ రీజనింగ్ పుస్తకాలు. 
గత ప్రశ్నలు: గ్రూప్-1, 2012
1.రాము తూర్పు దిక్కును చూస్తున్నాడు. 4 కి.మీ. ముందుకు నడిచి కుడివైపునకు తిరిగి 3 కి.మీ. నడిచెను. మళ్లీ తన కుడివైపునకు తిరిగి 4 కి.మీ. నడిచెను. ఆ తర్వాత అతను వెనకకు తిరిగెను. ఇప్పుడు రాము ఏ దిక్కున నడుస్తున్నాడు?

1.తూర్పు

2.పడమర

3.ఉత్తరం

4.దక్షిణం

సమాధానం: 1
2.ఒక మనిషి ఒక పనిని ఐదు రోజుల్లో చేయగ లడు. అయితే అతని కొడుకు సహాయంతో అదే పనిని మూడు రోజుల్లో చేయగలడు. అతని కుమారుడు ఒకడూ అదే పనిని ఎంత కాలంలో చేయగలడు?

1.6 1/2 రోజులు

2.7 రోజులు

3.7 1/2 రోజులు

4.8 రోజులు

సమాధానం: 3
Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment