తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు!
హైదరాబాద్: తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం త్వరలో తెలంగాణ పబ్లిక్
సర్వీస్ కమిషన్ (టీపీపీఎస్సీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీనికి సంబంధించి విధి విధానాలతో కూడిన ఫైలును ఉన్నత విద్యాశాఖ ఇప్పటికే రూపొందించిన విషయం తెలిసిందే.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడంతోపాటు దానికి పూర్తిస్థాయిలో పరిపాలన సదుపాయాలు,
నిర్వహణ కోసం చైర్మన్, సభ్యుల నియామకాలు జరపాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దీనికి సంబంధించి
మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.
పక్షం రోజుల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ | |
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను నెలాఖరులోపే ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
జులై 16న మంత్రిమండలి ఆమోదం తర్వాత దస్త్రాన్ని రాజ్‌భవన్‌కు పంపిస్తారు. గవర్నర్ అనుమతించిన వెంటనే కమిషన్
ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ ప్రక్రియ అంతా పక్షం రోజుల్లోపే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్ర విభజన చట్టంలో నిర్దేశించిన విధంగా పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేపట్టింది.
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అధ్యక్షతన గల కమిటీ ఇప్పటికే నియమనిబంధనలను ఖరారు చేసింది.
కమిషన్ ఏర్పాటుకు నేరుగా ఉత్తర్వులు జారీ చేయాలని భావించినా మంత్రిమండలి
ఆమోదం తీసుకోవడం వల్ల సాంకేతిక సమస్యలు ఉండవని అధికారులు సూచించారు. ఈ మేరకు దస్త్రాన్ని మంత్రిమండలిలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కమిషన్ సమగ్రస్వరూపం, ఇతర అంశాలతో దస్త్రాన్ని అధికారులు సిద్ధంచేశారు. బుధవారం మంత్రిమండలిలో ఆమోదం లభించిన వెంటనే దస్త్రాన్ని ఒకటి, రెండు రోజుల్లో గవర్నర్‌కు పంపిస్తారు. గవర్నర్ ఆమోదంతో దస్త్రం ప్రభుత్వానికి వచ్చాక ఆ తర్వాత ఒకటిరెండు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తారు.
|
0 comments:
Post a Comment