Telangana groups syllabus

శాతవాహనులు

మౌర్య సామ్రాజ్య పతనానంతరం శాతవాహనులు విదేశీ దాడులను అరికట్టి సామ్రాజ్యాన్ని స్థాపించారు.» క్రీ.పూ. 225 నుంచి క్రీ.శ. 225 వరకు పరిపాలించారు.
» వీరి కాలం వివాదాస్పదమైంది.
» వీరికే శాతవాహనులు అనీ, శాలివాహనులు అనే పేర్లున్నాయి.
» హేమచంద్రుడు అనే వ్యాకరణవేత్త వీరిని శాలివాహనులు అని పేర్కొన్నాడు.
» వీరు జారీ చేసిన 34 శాసనాల ద్వారా కొంతవరకు వీరి చరిత్రను తెలుసుకోవచ్చు.

34 శాసనాలలో ముఖ్యమైనవి

1. కృష్ణుడి నాసిక్ శాసనం
2. గౌతమీపుత్ర శాతకర్ణి నాసిక్ శాసనం
3. గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనం
4. రుషభదత్తుడి నాసిక్ శాసనం
5. నాగానిక నానేఘాట్ శాసనం
6. యజ్ఞశ్రీ చినగంజాం శాసనం
7. విజయశ్రీ నాగార్జునకొండ శాసనం
8. రెండో పులోమావి కార్లే, నాసిక్, ధరణీకోట శాసనాలు
9. మూడో పులోమావి మ్యాకదోని శాసనం
10. ఖారవేలుడి హతిగుంఫా శాసనం
11. గుంటుపల్లి శాసనాలు» శాసనాలన్నీ ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి.
» శాసనాలను బట్టి ఉత్తరాన మధ్యప్రదేశ్ నుంచి దక్షిణాన కర్ణాటక వరకు, తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు వీరి సామ్రాజ్యం విస్తరించి ఉందని తెలుస్తోంది.
» వీరు ఆంధ్రులే అని ఆర్.జి.భండార్కర్, మారేమండ రామారావు, డాక్టర్ ఎల్.డి.బార్నెట్, పి.వి.పరబ్రహ్మ శాస్త్రి, ఇ.జె.రాప్సన్, డాక్టర్ స్మిత్, బర్జెస్, గొర్తి వెంకట్రావు తదితరులు పేర్కొన్నారు.
» శాతవాహనులు ఆంధ్రులు కారని పేర్కొన్నవారిలో పి.టి.శ్రీనివాస అయ్యంగార్, డాక్టర్ మిరాషి, సుక్తాంకర్, డి.సి.సర్కార్, కె.గోపాలాచారి, జోగేల్కర్, పులాస్కర్, హెచ్.సి.రాయచౌదరి, జయస్వాల్, వి.యస్.భట్లే తదితరులు ఉన్నారు.
» మత్స్య, వాయు, విష్ణు, బ్రహ్మాండ పురాణాలు, హాలుడి గాథాసప్తశతి, గుణాఢ్యుడి బృహత్కథ, కుతూహలుడి లీలావతి పరిణయం, సోమదేవుడి కథాసరిత్సాగరం, వాత్సాయన కామసూత్రాలు, బౌద్ధ, జైన గ్రంథాలు, ప్లినీ, టాలమీ రచనలు, అజ్ఞాత నావికుడు రాసిన 'పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ' మొదలైనవి శాతవాహనుల చరిత్రకు ఆధార గ్రంథాలు.

శాతవాహన పాలకులు

1. శ్రీముఖుడు» ఆంధ్ర శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు.
» ఇతడికే శ్రీముఖ, సిముక, సింధుక, చిముక అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి.
» పురాణాలు శ్రీముఖుడినే ఆంధ్ర రాజ్య స్థాపకుడిగా వర్ణించాయి.
» జైన మత పోషకుడిగా, జైన దేవాలయాలను కట్టించినట్లు జైన సాహిత్యం ద్వారా తెలుస్తోంది.
» మొదట జైన మతాభిమానిగా ఉన్నప్పటికీ, తర్వాత వైదిక మతం స్వీకిరించినట్లు తెలుస్తోంది.
» శ్రీముఖుడు అశోకుడి సమకాలికుడు.
» పశ్చిమ దక్కన్ ప్రాంతాన్ని జయించి, 'రాఠికులు' అనే స్థానిక తెగను అధిగమించి, వారితో వివాహ సంబంధాలను ఏర్పరచుకున్నాడు.
» ఇతడి కుమారుడు శాతకర్ణి.
» మహారథి త్రాణకైరో కుమార్తె నాగానికతో శాతకర్ణికి వివాహం జరిపించాడు.
» శ్రీముఖుడు 23 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు.
» ఈయన జారీ చేసిన నాణేలు కరీంనగర్ జిల్లా కోటిలింగాల, ధూళికట్ట, సంగారెడ్డి, కొండాపురం, మహారాష్ట్రలోని అకోలా, జున్నార్, నెవాసా అనే ప్రాంతాల్లోనూ కర్ణాటకలోని సన్నతి వద్ద లభించాయి.2. కృష్ణ» శ్రీముఖుడి తర్వాత ఇతడి తమ్ముడు కృష్ణ అధికారంలోకి వచ్చాడు.
» ఇతడి మరో పేరు కన్హ.
» ఈయన రాజ్యాన్ని పశ్చిమాన నాసిక్ వరకు విస్తరింపజేశాడు.
» శాతకర్ణి భార్య నాగానిక నానేఘాట్ చిత్రాల్ని చెక్కించింది.
» నాగానిక నానేఘాట్‌లో తన తండ్రి, శాతకర్ణి, శ్రీముఖ, తన సంతాన చిత్రాన్ని చెక్కించింది. కానీ కృష్ణ చిత్రాన్ని చెక్కించకపోవడం వల్ల ఇతను సింహాసనాన్ని అక్రమంగా వశం చేసుకున్నాడని చరిత్రకారుల అభిప్రాయం.
» శ్రీముఖుడు చనిపోయే నాటికి శాతకర్ణి చిన్నవాడిగా ఉండటం వల్ల ఇతడు సింహాసనాన్ని అధిష్ఠించి ఉండవచ్చని కొందరి అభిప్రాయం.
» మగధలో పుష్యమిత్ర శుంగుడు, కళింగలో ఖారవేలుడు ఈయన కాలంలో అధికారంలో ఉన్నారు.3. శాతకర్ణి» శాతకర్ణి భార్య నాగానిక మరో పేరు నాయనిక.
» ఈమె రాచకార్యాల్లో పాల్గొంది.
» నాగానిక నానేఘాట్ శాసనాన్ని వేయించింది.
» పశ్చిమ మాల్వా, అనుప లేదా నర్మదా నదీ లోయ ప్రాంతాన్ని, విదర్భను శాతకర్ణి జయించాడు. ఈ విజయాలకు చిహ్నంగా అశ్వమేథ యాగాన్ని, రాజసూయ యాగాన్ని నిర్వహించినట్లు నానేఘాట్ శాసనం వల్ల తెలుస్తోంది.
» ఇతడికి 'దక్షణాపతి', 'అప్రతిహతఃచక్ర' అనే బిరుదులు ఉన్నాయి.
» ఖారవేలుడి హతిగుంఫా శాసనంలో ఇతడిని పేర్కొనడం జరిగింది.
» ఈయన కుమారుడు వేదశ్రీ చిన్నవాడు కావడం వల్ల ప్రభుత్వ వ్యవహారాలను వేదశ్రీ పేరుపై నాగానిక నిర్వహించింది.
» వేదశ్రీ యుక్తవయసుకు రాకముందే మరణించడం వల్ల వేదశ్రీ కుమారుడు సతిశ్రీ రాజ్యానికి వచ్చాడు
» మత్స్యపురాణం శాతకర్ణిని 'మల్లకర్ణి' అని పేర్కొంది.4. రెండో శాతకర్ణి» మగధ రాజధాని పాటలీపుత్రాన్ని, విదుష, కళింగ రాజ్యాలను ఆక్రమించాడు.
» ఇతడు ఖారవేలుడి చేతిలో ఓడిపోయినట్లు తెలుస్తోంది. 
» ఖారవేలుడి మరణం తర్వాతనే కళింగను జయించాడు.5. అపీలకుడు 
» లంబోదర పుత్రుడైన అపీలకుడి నాణెం చత్తీస్‌గఢ్‌లో లభించింది. 
» ఈ నాణెంపై 'శివశ్రీ అపీలక అని ఉంది. 
» ఈయన కాలంలోనే ఉత్తర జిల్లాలను కోల్పోయారు.6. కుంతల శాతకర్ణి 
» ఇతడు మొదట నిరక్షరాస్యుడే అయినా సంస్కృతం నేర్చుకున్నాడు. 
» ఈయన మంత్రుల్లో ఒకరైన శర్వవర్మ సంస్కృతంలో 'కాతంత్ర వ్యాకరణం' రచించాడు. 
» ఇతడు సంస్కృత భాషాభిమాని అవడం వల్ల మరో మంత్రి అయిన గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృతంలో రచించిన బృహత్కథను నాశనం చేయించాడని చరిత్రకారులు చెబుతుంటారు. 
» బృహత్కథలోని భాగమే 'కథా సరిత్సాగరం' అని చరిత్రకారుల అభిప్రాయం.
» ఈయన హయాంలో ప్రాకృత భాష స్థానంలో సంస్కృతం రాజభాష అయింది.
» రాజశేఖరుడి కావ్యమీమాంస, గుణాఢ్యుడి బృహత్కథ, వాత్సాయన కామసూత్రాల్లో ఈయన ప్రస్తావన ఉంది.
» ఇతడి శృంగార కార్యకలాపాల్లో భార్య మలయవతి చనిపోయినట్లు వాత్సాయనుడు తెలియజేశాడు.
» తాను జారీ చేసిన నాణేలపై పాటలీపుత్ర చిహ్నాన్ని ముద్రించాడు.7. హాలుడు
» శాతవాహన రాజుల్లో హాలుడు 17వ రాజు.
» సప్త గోదావరి - భీమా నదుల ఒడ్డున శ్రీలంక రాజకుమార్తె లీలావతిని వివాహమాడాడు. ఈ విషయాన్ని కుతూహలుడి 'లీలావతి పరిణయం' అనే గ్రంథం తెలియజేస్తోంది.
» కవులకు, పండితులకు ఆశ్రయం కల్పించడం వల్ల 'కవి వత్సలుడు' అనే బిరుదు వచ్చింది.
» రాజశేఖరుడి కావ్య మీమాంస, వాత్సాయనుడి కామసూత్రాల్లో ఇతడి ప్రస్తావన ఉంది.
» 700 శృంగార కథలను మహారాష్ట్రీ ప్రాకృతంలో 'గాథా సప్తశతి' అనే పేరుతో సంకలనం చేశాడు.8. గౌతమీపుత్ర శాతకర్ణి
» శివస్వాతి, గౌతమీ బాలశ్రీ కుమారుడు గౌతమీపుత్ర శాతకర్ణి.
» గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించింది.
»దీనిలో గౌతమీపుత్ర శాతకర్ణి వ్యక్తిత్వం, సాధించిన విజయాలు ఉన్నాయి.
» ఇతడికి ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ, క్షత్రియ దర్పమాన మర్దన, త్రిసముద్రతోయ పీతవాహన, ఏకశూర అనే బిరుదులు ఉన్నాయి.
» శాతవాహనులు తమ పేర్లతో పాటు తల్లి పేరును జతపరచుకునే సంప్రదాయం ఇతడితోనే మొదలైంది.
» న‌హ‌పానుడి క్షాత్రప వంశాన్ని సమూలంగా నాశనం చేశాడు.
» న‌హ‌పానుడి నాణేలు మహారాష్ట్రలోని జోగల్‌తంబి వద్ద అత్యధికంగా లభించాయి.
» న‌హ‌పానుడిని జయించిన సందర్భంగా సగం నాణేలపై తన బొమ్మను ముద్రించుకున్నాడు.
» హిందూ మతాభివృద్ధికి విశేషంగా కృషి చేశాడు.
» ఇతడితో పాటు రాణి అయిన వాసిష్ఠి ధర్మోద్ధరణకు విశేషంగా కృషి చేసింది.
» శాక్య రాజు రుద్రదామనుడు ఇతడిని ఓడించి కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు.
» దక్కన్ ప్రాంతాన్నే కాక మాళవ, సౌరాష్ట్రలను; రాజస్థాన్‌లోని కొంత భాగాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి పాలించాడని నాసిక్ శాసనం తెలుపుతోంది.
» గౌతమీపుత్ర శాతకర్ణి సైతం శకుల నుంచి కొన్ని ప్రాంతాలను గెలుచుకున్నప్పటికీ వాటిని తిరిగి వారికే ఇచ్చేసినట్లు రుద్రదామనుడు జారీచేసిన జునాగఢ్ శాసనం వల్ల తెలుస్తోంది.9. వాసిష్ఠీపుత్ర పులోమావి
» వాసిష్ఠీపుత్ర పులోమావి గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత రాజ్యాధికారం చేపట్టాడు.
» ఈయన కాలంలో వాయవ్య ప్రాంతం నుంచి శకుల ఒత్తిడి ఎక్కువైనప్పటికీ పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో శాతవాహన సామ్రాజ్యం విచ్ఛిన్నమైనప్పటికీ కృష్ణానది ముఖద్వారం చుట్టుపక్కల అధికారాన్ని స్థాపించారు.
» ఈయన అమరావతి శాసనాన్ని వేయించాడు.
» ఇతడినే వాసిష్ఠీపుత్ర రెండో పులోమావి అని కూడా అంటారు.
» ఇతడి కాలంలోనే ఈయన తల్లి గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించింది.
» నాసిక్ శాసనంలో ఇతడిని 'దక్షిణ పథేశ్వరుడు'గా పేర్కొన్నారు.
» ఈయన కాలంలోనే అమరావతి స్థూపాన్ని నిర్మించారు.
» ఈయన ధాన్యకటకాన్ని (అమరావతి) రాజధానిగా చేసుకుని పరిపాలించాడు.
» ఈయన జారీ చేసిన శాసనాలు నాసిక్‌లో నాలుగు, కార్లేలో రెండు, అమరావతిలో ఒకటి, ధరణికోటలో ఒకటి మొత్తం ఎనిమిది లభించాయి.
» ఆంధ్ర ప్రాంతంలో ఈయన నాణేలు విరివిగా లభించాయి.10. గౌతమీపుత్ర శివశ్రీ శాతకర్ణి
» ఇతడు గౌతమీపుత్ర శాతకర్ణి రెండో కుమారుడు.
» ఇతడికి 'క్షత్రప' అనే బిరుదు ఉంది.
» ఇతడు రుద్రదాముడి కుమార్తెను వివాహమాడాడని రుద్రదాముడు వేయించిన జునాగఢ్ శాసనం ద్వారా తెలుస్తోంది.
» జునాగఢ్ శాసనం సంస్కృతంలో వేసిన మొదటి శాసనం.
» ఇతని తర్వాత శివస్కంధుడు రాజ్యానికి వచ్చాడు.11. గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి
» ప్రసిద్ధి చెందిన శాతవాహన రాజుల్లో చివరివాడు గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి.
» ఈయన ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు.
» అమరావతి స్థూపాన్ని విస్తృతపరచడమే కాకుండా దాని చుట్టూ ఇనుప కంచెను నిర్మింపజేశాడు.
» రుద్రదామనుడు మరణం తర్వాత ఉజ్జయినిలో అల్లకల్లోలాలు చెలరేగాయి. వీటిని ఆసరాగా తీసుకుని ఉజ్జయినిపై దండెత్తి గెలుపొందాడు.
» హర్షవర్ధనుడి చరిత్రను రాసిన బాణభట్టు ఇతడిని 'త్రిసముద్రాధిపతి'గా పేర్కొన్నాడు.
» మత్స్యపురాణం సంకలనం ఇతడి కాలంలోనే ప్రారంభమైంది.
» శ్రీపర్వతానికి మరో పేరు నాగార్జునకొండ. ఈ కొండపై నాగార్జునుడి కోసం పారావతి విహారాన్ని నిర్మించాడు. ఈ విహారాన్నే మహావిహారం అని కూడా అంటారు.
» రోమ్‌తో ఎక్కువగా వర్తకం జరిపాడు.
» తెరచాప లేదా లంగరు ఓసిన ఓడ చిహ్నంతో నాణేలను ముద్రించాడు.
» శక రాజులైన జీవదామనుడికి, రుద్రదామనుడికి మధ్య ఉన్న కలహాలే ఇతడి విజయానికి మూలకారణం.
» ఈయనకు, ఆచార్య నాగార్జునుడికి జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలే 'సుహృల్లేఖ' గ్రంథమైంది.
» విజయశ్రీ శాతకర్ణి శ్రీ పర్వతం దగ్గర 'విజయపురి' అనే పట్టణాన్ని నిర్మించింది.

మూడో పులోమావి

» శాతవాహనుల్లో చివరి పాలకుడు.
» బళ్లారిలో మ్యాకదోని శాసనాన్ని వేయించాడు.
» ఇతడి సేనాధిపతుల్లో ఒకరైన శ్రీశాంతమాలుడు ఇతడిపై తిరుగుబాటు చేయడం వల్ల బళ్లారికి వెళ్లినట్లు తెలుస్తోంది.
» శాతవాహనుల తర్వాత వారి సామంతులైన అభీరులు, చుటునాగులు, ఇక్ష్వాకులు, పల్లవులు స్వతంత్ర రాజ్యాలను స్థాపించుకున్నారు.

* * *

శాతవాహనులు - ఇతర అంశాలు

» ఆంధ్రులకు 30 నగరాలు, లక్ష కాల్బలం, రెండు వేల అశ్వదళం, వెయ్యి ఏనుగులు ఉన్నట్లు మెగస్తనీస్ 'ఇండికా' అనే గ్రంథంలో పేర్కొన్నాడు.
» శాతవాహన సామ్రాజ్యం కేంద్రీకృతమైంది కాదు. మైసూరులో చుటు వంశీయులు, ఇక్ష్వాకులు, కొన్ని ప్రాంతాలలో మహారథి, మహాభోజ అనే బిరుదులు ధరించిన సామంతులు వీరి ఆధీనంలో ఉండేవారు.
» దేశాన్ని మనం రాష్ట్రాలుగా విభజించుకున్నట్లు వారు తమ రాజ్యాన్ని ఆహారాలుగా విభజించుకున్నారు.
» ఈ ఆహారాలకు ఉదా: సోపారాహార, గోవర్ధనాహార, శాతవాహనాహార, మామలాహార.
» ఆహారాలకు పాలనాధిపతులు అమాత్యులు.
» ముఖ్యంగా ఇద్దరు అమాత్యులు రాజు కింద పనిచేస్తుండేవారు.
వారు: 1) రాజామాత్యుడు 2) మహామాత్రుడు.రాజామాత్యుడు: రాజు సమక్షంలో పనిచేస్తూ రాజుకు సలహాలిస్తాడు.
మహామాత్రుడు: ప్రత్యేకమైన కార్యం కోసం నియమించిన అధికారి. అయిదు రకాలైన ఉన్నతోద్యోగి బృందం ఇతడి కింద పనిచేస్తుంది.(1) మహాసేనాధిపతి 
(2) భండాగారికుడు 
(3) లేఖకుడు 
(4) హిరణ్యకుడు 
(5) అక్షపటకులు లేదా నిబంధకారులు.1) మహాసేనాధిపతి సైన్య వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటాడు.
2) భండాగారికుడు వస్తువులను, ఆహార ధాన్యాన్ని భద్రపరుస్తాడు.
3) లేఖకుడు రాజపత్రాలను, రాజ శాసనాలను రచించడమే కాకుండా రాజుకు ఆంతరంగిక కార్యదర్శిగా వ్యవహరిస్తాడు.
4) హిరణ్యాక్షుడు ద్రవ్య రూపమైన ఆదాయాన్ని భద్రపరుస్తాడు.
5) అక్షపటకులు లేదా నిబంధకారులు రాజ్య వ్యవహారాలను, రాజు ఇచ్చే ఆజ్ఞలను పత్రాలలో రాసి భద్రపరుస్తారు.గ్రామం:» పాలనకు గ్రామమే ప్రాతిపదిక.
» 'గ్రామిక' లేదా 'గ్రామణి' గ్రామానికి పాలనాధికారి.

నిగమం

» నిగమం అంటే పట్టణం.
» పట్టణాల్లో నిగమ సభ అనే పౌరసభ ఉండేది.
» భారుకచ (బ్రోచ్), సోపార, కన్హేరి, కళ్యాణి, పైథాన్, తగర, జున్నార్, కార్లే, గోవర్ధన, ధనకటక మొదలైన పట్టణాల పేర్లు తరచూ శాసనాల్లో కనిపిస్తాయి.
» రైతుల ఇళ్లల్లో గహపతి కుటుంబ పెద్ద.
» కుల పెద్దను కూడా గహపతి అన్నారు.
» గహపతులు కూడా నిగమ సభల్లో సభ్యులే.అలంకరణలు:» పువ్వులపై ప్రీతి ఎక్కువ.
» సుగంధ ద్రవ్యాలను ఎక్కువ వాడేవారు.
» స్త్రీలు కాళ్లకు కడియాలు పెట్టుకోవడమనేది అతి సాధారణ విషయం.
» కర్ణాభరణాలు, గాజులు, కంకణాలు, హారాలను ధరించడంలో స్త్రీ, పురుష వివక్ష లేదు.
» పురుషులు నడుము నుంచి మోకాళ్ల వరకు వస్త్రాలను ధరించేవారు.
» స్త్రీలు నడుము నుంచి మోకాళ్ల వరకు ధరించిన వస్త్రంలోని కొంత భాగాన్ని వక్ష స్థలానికి కప్పుకునేవారు.

శిస్తు

» పంటలో వ వంతును శిస్తుగా వసూలు చేసేవారు.
» పంటలో రాజు భాగాన్ని 'దేయమేయం' అనేవారు.
» శిస్తును ధాన్య రూపంలో కానీ ద్రవ్యరూపంలో కానీ స్వీకరించేవారు.
» రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం భూమి శిస్తు.
» రైతులకు భూమిపై హక్కు ఉండేది.

చేతి వృత్తులు

» శాసనాల్లో పలు చేతివృత్తులవారు కనిపిస్తారు.
1) వధకులు (వడ్రంగులు)
2) సేలవధకులు (శిల్పులు)
3) గధికులు (సుగంధ ద్రవ్యాలను తయారుచేసేవారు)
4) సువర్ణకారులు (కంసాలులు)
5) పసకరులు (మేదరివారు)
6) కులారులు (కుమ్మరులు)
7) తెసకారులు (మెరుగుపెట్టేవారు)
8) కాసకారులు (కంచుపనివారు)
9) కోలికులు (సాలెవారు)
10) తిలపిష్టకులు (నూనె తయారుచేసేవారు)
11) కమారులు (కమ్మరులు)
12) చంకుకారులు (చర్మకారులు)
» ఒక్కో వృత్తి చేపట్టేవారు ఒక్కో సంఘంగా ఏర్పడ్డారు.
» ఈ సంఘాన్నే శ్రేణి అంటారు. శ్రేణికి అధిపతి శ్రేష్ఠి.
» ఈ శ్రేణులు అవలంబించాల్సిన నియమ నిబంధనలను 'శ్రేణి ధర్మం అంటారు.
» శ్రేణిలోని సభ్యులే ఈ శ్రేణి ధర్మాన్ని తయారు చేసుకునేవారు.
» ఈ శ్రేణి ధర్మానికి రాజ్య గుర్తింపు ఉండేది.
» ఈ వృత్తి సంఘాలే తర్వాత కులాలుగా రూపొందాయి.నాణేలు:» శాతవాహనులు తమ నాణేలను వెండి, బంగారం, సీసం, తగరం, రాగి, ఫోటిన్ మొదలైన లోహాలతో తయారు చేసేవారు.
» వెండి నాణేలను కార్షపణం అంటారు.
» బంగారు నాణేన్ని సువర్ణం అంటారు.
» 35 కార్షపణాలు ఒక సువర్ణంతో సమానం.
» ఈ నాణేలపై చైత్యం, ఏనుగు, సింహం, వృషభం, విల్లు, ఉజ్జయిని చిహ్నం ఉండేవి.
» ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో రాసేవారు.సైన్యం:» సైన్యంలో చతురంగ బాలాలు ఉండేవి.
» తాత్కాలిక సైనిక శిబిరాన్ని 'సంధవారం' అంటారు.
» శాశ్వత సైనిక శిబిరాన్ని 'కటకం' అంటారు.ఎగుమతులు:» దంతాలు, నూలు వస్త్రాలు, పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, ఆభరణాలు, నూలు దారం రోమ్‌కు ఎగుమతి అయ్యేవి.దిగుమతులు:» మద్యం, రాగి, వెండి, బంగారం, గాజు రోమ్ నుంచి దిగుమతి అయ్యేవి.

రేవు పట్టణాలు:

» పశ్చిమాన బరుకచ్ఛం, సోపార, కళ్యాణ; తూర్పున కోడూరు, మైసోలి, ఘంటసాల, మోటుపల్లి, కోరంగి.ప్రయాణ సాధనాలు:» నదులలో నౌకల ద్వారా ప్రయాణించేవారు.
» ఎడ్ల బళ్లు, పల్లకీల్లో ప్రయాణాలు సాగేవి.పంటలు:చెరకు, నువ్వులు, ఉల్లి, అల్లం, పత్తి, రాగులు, కంది, పెసర, ఆముదాలు, కొబ్బరి.విదేశీ ద్రవ్యం:» రోమ్ దేశం శాతవాహనులకు ఎక్కువగా చెల్లింపులను బంగారం రూపంలో జరిపేది. అందువల్ల బంగారం విపరీతంగా వచ్చి పడేది.
» సంవత్సరానికి 11 వేల స్టెర్లింగుల బంగారం శాతవాహనులకు తరలిపోతోందని ప్లినీ వాపోయాడు.స్త్రీ స్వేచ్ఛ:» స్త్రీకి అధిక స్వేచ్ఛ ఉండేది.
» సంఘంలో గౌరవ మర్యాదలను పొందేవారు.
» ఎక్కువ విద్యను అభ్యసించేవారు.
»దానధర్మాలు విరివిగా చేశారు.
» ఆస్తి హక్కు ఉంది.
» పాలనా వ్యవహారాల్లో సైతం పాలుపంచుకునేవారు.

విదేశీ రచయితలు - రచనలు

I) టాలమీ - గైడ్ టు జాగ్రఫీ
II) మెగస్తనీస్ - ఇండికా
III) ప్లినీ - నేచురల్ హిస్టరీ
IV) పేరు లభ్యం కాని నావికుడు - పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ
V) హుయాన్‌త్సాంగ్ - సీయూకీక్రతువులు:» రాజులు అశ్వమేథ, రాజసూయ యాగాల్నే కాకుండా అగ్న్యాధేయ, అనారంభనీయ, భగళాదశరాత్ర, గర్గత్రిరాత్రి, గవామయన, శతాతిరాత్ర మొదలైన క్రతువులను నిర్వహించేవారు.ప్రార్థనా గీతాలు:» ఇంద్ర, శంకర్షణ, వాసుదేవ, చంద్ర, సూర్య, యమ, వరుణ, కుబేరుల ప్రార్థనా గీతాలను ఆలపించేవారు.
» గాథాసప్తశతి శివస్తోత్రంతో మొదలవుతుంది.
» గౌరి, సరస్వతుల గురించి స్తోత్రాలు ఉన్నాయి.ఆచార్య నాగార్జునుడు:» ఇతడి కాలం, జన్మస్థానం, మత ప్రచారాల గురించి వాదోపవాదాలు ఉన్నాయి.
» ఈయన బౌద్ధ సన్యాసి.
» మహాయాన సిద్ధాంత ప్రవక్త.
» ఈయన రచించిన 25 గ్రంథాలు చైనా అనువాదాల్లో లభ్యమవుతున్నాయి.
» ఈయన తన గ్రంథాలన్నింటినీ సంస్కృతంలోనే రచించాడు.ముఖ్య గ్రంథాలు:1. సుహృల్లేఖ
2. శూన్యసప్తతి
3. ప్రజ్ఞాపారమిత శాస్త్ర
4. మూల మాధ్యమిక శాస్త్ర
5. ద్వాదశనికాయ శాస్త్ర
6. రసరత్నాకరం

దేశీ రచయితలు - రచనలు

1. గుణాఢ్యుడు - బృహత్కథ
2. హాలుడు - గాథాసప్తశతి
3. శర్వవర్మ - కాతంత్ర వ్యాకరణం
4. కుతూహలుడు - లీలావతి పరిణయం
5. వాత్సాయనుడు - కామసూత్రాలు
» సంస్కృతంలో రచనలు శాతవాహనుల కాలంలోనే ప్రారంభమయ్యాయి.
» ఆరు నెలల కాలంలో శర్వవర్మ తన రాజుకు సంస్కృతంలో వ్యాకరణం నేర్పాలని కాతంత్ర వ్యాకరణాన్ని రచించాడని చెబుతారు. ఈ గ్రంథాన్ని ఇప్పటికీ బంగ్లాదేశ్‌లోనూ, కాశ్మీరులోనూ చలామణిలో ఉంది.
» సోమదేవుడి కథా సరిత్సాగరం, బుద్ధస్వామి రచించిన బుద్ధ కథా శ్లోక సంగ్రహ, క్షేమేంద్రుడి బృహత్కథా మంజరి బృహత్కథ‌ రూపాంతరాలే.

బృహత్కథ గురించి రచయితల అభిప్రాయం

1. బృహత్కథలోని కథలన్నీ సంస్కృత కథల నుంచి ఎరువు తెచ్చుకున్న పీలికలతో కుట్టిన గుడ్డల వలే కనబడుతున్నాయని తిలకమంజరి గ్రంథకర్త ధనపాలుడి అభిప్రాయం.
2. వాల్మీకి, వ్యాస మహర్షులకు ఇచ్చిన స్థానాన్నే గోవర్థనుడు గుణాఢ్యుడికి ఇచ్చాడు.
3. నాటక రచయితలకు రామాయణం ఎలాంటి గనో బృహత్కథ కూడా అలాంటి గనియేనని దశరూప గ్రంథకర్త సెలవిచ్చాడు.
4. కథా సరిత్సాగరం, బృహత్కథా మంజరి, బుద్ధ కథా శ్లోక సంగ్రహ ఈ మూడు గ్రంథాలను ఉపయోగించి అసలు బృహత్కథను పునరుద్ధరించవచ్చునని ఆచార్య పెలిక్స్ లకోట్ అన్నారు.
» గాథాసప్తశతిలో అత్త, పాడి, పొట్ట, పిల్ల, పత్తి అనే తెలుగు పదాలు ఉన్నాయి.బంగారు గనులు:
వొందపల్లి, కొల్లార్, హత్తి, మాస్కీలలో బంగారు గనులు ఉండేవి.బౌద్ధమతంలో శాఖలు:
1. భదయనీయ
2. మహా సాంఘిక
3. పూర్వ శైల
4. అపర శైలనాసిక్‌లో భదయనీయ శాఖకు చెందినవారు, కార్లేలో మహా సాంఘిక శాఖకు చెందినవారు, నాగార్జునకొండపై పూర్వ శైల, అపర శైల శాఖలకు చెందినవారు ఉండేవారు.బౌద్ధుల కట్టడాల్లో 3 భాగాలున్నాయి.1. స్థూపం 
2. విహారం 
3. చైత్య గృహం1. స్థూపం: బుద్ధుడి అస్తికలపై నిర్మించింది స్థూపం. భట్టిప్రోలు, అమరావతి, ఘంటసాల స్థూపాలకు ఉదాహరణలు.
1797లో శిథిలావస్థలో ఉన్న అమరావతి స్థూపాన్ని కల్నల్ మెకంజీ కనుక్కున్నారు. ఈ స్థూప భాగాల్లో ఎక్కువ భాగాన్ని లండన్‌కు, మిగిలిన భాగాన్ని మద్రాస్‌కు తరలించారు.
2. విహారం: బౌద్ధ భిక్షువుల నివాస స్థానాలే విహారాలు. ఇలాంటి విహారాలు భూమిపైన, కొండల పైన నిర్మించారు. కొండలను తొలచి చేసిన విహారాలు, ఇటుకలతో కట్టిన విహారాలు ఉన్నాయి.
» కోరుకొండ, గుంటుపల్లి, కొండాపురం, విజయవాడ, సంఘరంలలో గుహ విహారాలు ఉన్నాయి.
» అమరావతి, నాగార్జున కొండలలో ఇటుకలతో నిర్మించిన విహారాలు ఉన్నాయి.3. చైత్య గృహం:
బౌద్ధులు ప్రార్థన కోసం వినియోగించే గృహాలే చైత్య గృహాలు.» పశ్చిమాన నాసిక్, కార్లే, కన్హేరి, జెడ్సాలో ఉన్నాయి.
» చేజెర్ల, గుంటుపల్లి, శాలిహుండం, రామతీర్థం, విజయవాడ, నాగార్జునకొండ మొదలైన చోట్ల ఇటుకలతో నిర్మించిన చైత్య గృహాలు ఉన్నాయి.
» తెలుగునాట అత్యంత ప్రాచీనమైనది గుంటుపల్లి చైత్యం.ఫణిగిరి: 
నల్గొండ జిల్లాలో సూర్యాపేట నుంచి 35 కి.మీ. దూరంలో బౌద్ధ క్షేత్రం ఉంది. ఇక్కడ అనేక బౌద్ధ స్థూపాలు బయల్పడ్డాయి.గాజులబండ: 
ఫణిగిరికి 4 కి.మీ. దూరంలో గాజులబండ ఉంది. ఇక్కడ కూడా అనేక బౌద్ధ స్థూపాలున్నాయి.దూళికట్ట: 
కరీంనగర్ జిల్లాలోని దూళికట్ట గ్రామంలో మహాస్థూపం, చైత్యాలు, నాణేలు బయల్పడ్డాయి.
మహా చైత్యకులు 5 వస్తువులను ఆరాధిస్తారు.1) చైత్యం 
2) పద్మం 
3) బోధి వృక్షం 
4) సింహాసనం 
5) బుద్ధుడి పాదాలు.
» 1892లో కలకత్తాలో ధర్మపాలుడు 'మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియా' అనే సంస్థను స్థాపించాడు.
» ఇతడు 1893లో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి బౌద్ధ మతం తరఫున హాజరయ్యాడు.బౌద్ధ మతానికి రాజాదరణ:
1. భదయనేయ శాఖకు చెందిన భిక్షువులకు గౌతమీ బాలశ్రీ ఒక గుహను తొలపించింది.
2. తెకెరసి కొండపై ఉండే భిక్షువులకు గౌతమీపుత్ర శాతకర్ణి 200 నివర్తనాల స్థలాన్ని ఇచ్చాడు.
3. రెండో పులోమావి మహాసాంఘిక శాఖకు ఒక గ్రామం ఇచ్చాడు.
4. తిరనిహూ కొండపై ఉండే భిక్షువులకు గౌతమీ బాలశ్రీ, గౌతమీ పుత్ర శాతకర్ణి ఇద్దరూ కలిసి 100 నివర్తనాల స్థలాన్ని దానమిచ్చారు.
5. కన్హుడు అనే రాజు నాసిక్ వద్ద ఒక గుహను తొలపించాడు. బౌద్ధుల రక్షణ కోసం 'మహామాత్ర అనే ఉద్యోగిని నియమించాడు.
6. నాగానిక నానేఘాట్‌లో ఒక గుహను తొలపించడమే కాకుండా అక్కడ ఒక శాసనాన్ని వేయించింది.
7. యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుడికి శ్రీపర్వతంపై ఒక విహారాన్ని నిర్మించాడు.
» భారతదేశంలో భూమిని దానం చేసిన తొలి రాజ వంశం శాతవాహనుల వంశమే.
» ప్రజలు సైతం బౌద్ధ భిక్షువుల అవసరాలను తీర్చడంలో ఆసక్తిని కనబరిచారు.
» బౌద్ధ భిక్షువులకు కొత్త వస్త్రాలు ఇవ్వడం అనేది ఆ రోజుల్లో ఆచారంగా ఉండేది. ఈ వస్త్రదానం కోసం శ్రేణుల వద్ద ప్రజలు ధనాన్ని పెట్టుబడిగా పెట్టి సంవత్సరానికి వచ్చే వడ్డీతో వస్త్రాలను కొనేవారు.జైనం:
» శాతవాహనులు మొదట జైన మతస్థులు.
» కరీంనగర్ జిల్లాలోని 'మునులగుట్ట' జైన స్థావరమే.
» మునులగుట్టలో సిముఖుడి నాణేలు లభ్యమయ్యాయి.
» నల్గొండ జిల్లాలోని కొలనుపాక ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తున్న ఏకైక జైన స్థావరం.
» కొలనుపాకలో శ్వేతాంబర శాఖ మాత్రమే ఉండేది.
» కొలనుపాకలో ఒకటిన్నర మీటర్ల మహావీరుడు విగ్రహం ఉంది.

Posted on 03-07-2015

Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment